కుంకుమపువ్వు ఫేస్‌ప్యాక్‌

14-10-2019: ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచుకునేందుకు కుంకుమపువ్వు పనికొస్తుంది. పచ్చి పాలలో కొద్దిగా కుంకుమపువ్వును రాత్రంతా నానబెట్టాలి. ఆ నీళ్లలో కొన్ని చుక్కల బాదం నూనె లేదా ఆలివ్‌ నూనె కలిపితే సాఫ్రాన్‌ ఫేస్‌ప్యాక్‌ రెడీ. రోజ్‌వాటర్‌లో ముంచిన కాటన్‌తో ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. దీనిలోని విటమిన్లు, లవణాలు నిర్జీవంగా మారిన చర్మానికి పోషణనిచ్చి కాంతిమంతంగా మారుస్తాయి. కంటి కింది నల్ల వలయాలను తొలగిస్తాయి. ముఖానికి రక్తప్రరణ పెంచి ముఖం తాజాగా కనిపించేలా చేస్తాయి.