రవికాంచినా.. వికసించుమా.

ఆంధ్రజ్యోతి(20/05/15): వసంతాన్ని వెనెక్కి నెట్టిన కాలం గ్రీష్మ తాపాన్ని తీసుకొచ్చేసింది. రోహిణిలోకి రాకముందే భానుడు.. భగభగలతో సెగలు కక్కుతున్నాడు. కుసుమాలు తాకితే నే కందిపోయేలా ఉండే మగువ మేను ఎండవేడిమి తాళలేకపోతోంది. ఎండ కన్నెరిగితే చాలు.. చర్మం మండిపోతుం
టుంది. ఈ సమస్యలకు చెక్‌ పెట్టాలంటే స్పెషల్‌ కేర్‌ తప్పనిసరి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సరి, రవికాంచినా మీ అందం వికసిస్తూనే ఉంటుంది.

 ఎంత ఏసీలో ఉన్నా.. ఇంట్లో కూలర్‌ ముందే తిష్టవేసినా.. కాసింత ఎండ తగలగానే ముఖారవిందం చెమటలు పట్టేసి డల్‌గా మారిపోతుంది. ఇక పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే సరేసరి. తీక్షణమైన సూర్యకిరణాలు.. చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే బయటకు వెళ్లే అరగంట ముందు ముఖానికీ, చేతులకు సన్‌ స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవడం మంచిది. ఇది ఖర్చుతో కూడుకున్న పని అని అనుకున్నవారు ఇంట్లోనే హెర్బల్‌ ఫేస్‌ ప్యాక్‌ చేసుకుంటే బెటర్‌. ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవాళ్లు కాస్త కీరా, నిమ్మరసం మిక్స్‌ చేసి పదిహేను నిమిషాలు ఫేస్‌ ప్యాక్‌ చేసుకుంటే ఎండ నుంచి మీ ముఖాన్ని రక్షించుకోవచ్చు. అదే డ్రై స్కిన్‌ ఉన్నవాళ్లు కీరా గుజ్జు, మీగడ మిక్స్‌ చేసి అప్లయ్‌ చేసుకుంటే మంచింది. కీరా జ్యూస్‌, వాటర్‌మెలన్‌ జ్యూస్‌ కలగలిపి ఫేస్‌కు అప్లయ్‌ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. రోజ్‌వాటర్‌ కూడా వేసవిలో గుణాన్ని చూపిస్తుంది.

 
వాష్‌ ఈజ్‌ విష్‌..
ఫేస్‌ ప్యాక్‌ల ఎండాకాలంలో అన్నింటికన్నా మేలు చేసేది మంచినీళ్లే. తరుచూ మంచి నీళ్లు తాగటం వల్ల శరీరం తేలికవుతుంది. కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగటం మంచిది. అంతేకాదు గంటకోసారి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి. వేసవిలో చెమట బాగా రావడం వల్ల.. చర్మంపై లవణాలు చేరి మీ అందం సన్నగిల్లుతుంది. తరుచూ నీటితో కడగటం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
రెండ్రోజులకోసారి...
ముఖం సంగతి అలా ఉంచితే.. కాళ్లు, చేతుల గురించి కూడా కాస్త పట్టించుకోండి. వేసవిలో కాటన్‌ ఫ్యాబ్రిక్‌ ధరించడం కామనే. రెండు, మూడు రోజులకొకసారి.. కాళ్లను, చేతులను 15 నుంచి 20 నిమిషాల పాటు నీళ్లలో ఉంచి చూడండి. కొంత సేపు గోరువెచ్చటి నీళ్లలో, మరికాసేపు చ ల్లటి నీళ్లలో ఉంచడం మరింత శ్రేయస్కరం. దీనివల్ల.. స్వేదరంధ్రాల్లోని మలినాలు తొలిగిపోవడంతో పాటు.. కాళ్లు, చేతుల్లో రక్తప్రసరణ కూడా పెరిగి చర్మం వన్నె తగ్గకుండా కనిపిస్తుంది. మరెందుకాలస్యం ఈ చిన్నపాటి టిప్స్‌ ఫాలో అయ్యి సమ్మర్‌ను సరదాగా దాటేయండి.