ముఖం తాజాగా ఉండాలంటే!

ఆంధ్రజ్యోతి(20/06/14): రాత్రి నిద్రకు ముందు ముఖాన్ని క్లీన్సర్‌తో శుభ్రపరుకోవటం ఎంతో అవసరం. క్లీన్సర్‌ వల్ల చర్మ రంథ్రాలు శుభ్రపడి చర్మపు సహజ నూనెలు స్రవిస్తాయి. ఫలితంగా ముఖ చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. అయితే మార్కెట్లో మనకెన్నో క్లీన్సర్లు దొరుకుతున్నాయి. కానీ వాటిలోని రసాయనాల గాఢత మూలంగా చర్మంపై మురికితోపాటు చర్మపు సహజ నూనెలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లోనే క్లీన్సర్లను తయారుచేసుకోవాలి. 
పాలు సహజసిద్ధమైన క్లీన్సర్‌: నిద్రకు ముందు పచ్చి పాలలో దూది ముంచి ముఖం, మెడ రుద్దుకోవాలి. ఆరిన తర్వాత మళ్లీ రిపీట్‌ చేయాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరనిచ్చి చల్ల నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. 
నూనె చర్మం: శనగపిండి, పచ్చిపాలు, పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.
పొడి చర్మం: తేనె, పెరుగులతో ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవాలి. తేనె, పెరుగులు మాయిశ్చరైజర్‌లా పని చేసి పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
నార్మల్‌ స్కిన్‌:దోసకాయ తరుగుతో ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. లేదా దోస రసం, పెరుగు సమపాళ్లలో కలుపుకుని ముఖానికి అప్లై చేయాలి. 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. 
అన్ని చర్మ తత్వాలు:అన్ని రకాల చర్మ తత్వాలకు సూటయ్యే క్లీన్సర్‌...రోజ్‌ వాటర్‌. రాత్రి నిద్రకు ముందు రోజ్‌వాటర్‌ను ముఖం మొత్తం అద్దుకుని పడుకుంటే తెల్లారేసరికి చర్మం మృదువుగా మారుతుంది.