మాన్‌సూన్‌ మేకప్‌!

11-07-2019: వానలు మొదలైతే, మేకప్‌ రక్షణ గురించిన భయాలు మొదలవుతాయి. చల్లని వాతావరణం, చిరుజల్లులతో కూడిన వానాకాలంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మేకప్‌ చెక్కుచెదరకుండా కాపాడుకోవచ్చు.
 
క్లీనింగ్‌: మేకప్‌కు ముందు ముఖాన్ని మన్నికైన క్లీన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. క్లీన్సర్‌ వాడడం వల్ల ముఖం మీద మిగిలిపోయిన తేమతోపాటు పేరుకున్న ధూళి పూర్తిగా తొలగిపోతుంది.
 
టోనర్‌: టోనర్‌తో ముఖం మీది చర్మరంథ్రాలు కుంచించుకుపోతాయి. టోనర్‌ పిహెచ్‌ వాల్యూ సమం చేసి, వర్షాకాలం వాతావరణానికి తగ్గట్టు చర్మాన్ని సిద్ధం చేస్తుంది.
 
మాయిశ్చరైజర్‌: ఎలాంటి వాతావరణంలోనైనా మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్‌ ాడవలసిందే!
 
ఐస్‌ ముక్క: మేకప్‌ చర్మం మీద సమంగా పరుచుకోవాలంటే చర్మం నున్నగా ఉండాలి. ఇందుకోసం చర్మరంథ్రాలు మూసుకుపోయేలా మంచు ముక్కతో ముఖం మీద రుద్దుకుని, తుడిచేసుకోవాలి. ఆ తర్వాత మేకప్‌ మొదలుపెట్టాలి.
 
ప్రైమర్‌: ప్రైమర్‌ ముఖం మీద దుమ్ము, నీరు లాంటివి నిలిచిపోకుండా రక్షణ పొరలాగా పనిచేస్తుంది. కాబట్టి మన్నికైన ప్రైమర్‌ వాడాలి.
 
ఫౌండేషన్‌: వర్షాకాలంలో జిడ్డు ఎక్కువ. కాబట్టి ఫౌండేషన్‌ సాధ్యమైనంత తక్కువ వాడాలి. చర్మపు రంగులో కలిసే ఫౌండేషన్‌ను అతి పలుచగా అప్లై చేసుకోవాలి.
 
కాంపాక్ట్‌: పౌడర్‌ బదులు, కాంపాక్ట్‌ కేక్‌ వాడాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు టచప్‌ చేసుకుంటూ ఉంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.
 
వాటర్‌ప్రూఫ్‌: మస్కారా, కోల్‌ వాటర్‌ప్రూఫ్‌ వాడాలి.
 
మేకప్‌ స్ర్పే: మేకప్‌ ముగిసిన తర్వాత రోజంతా చెక్కుచెదరకుండా ఉండడం కోసం, చివర్లో సెట్టింగ్‌ స్ర్పే వాడాలి.