మేకప్‌ కాస్త కొత్తగా!

22-10-2019: నియాన్‌ బ్రైట్‌ ఐ లైనర్‌, మెటాలిక్‌ మేకప్‌, ఆయిల్డ్‌ లిప్స్‌... ఇవన్నీ సరికొత్త బ్యూటీ ట్రెండ్స్‌. సెలబ్రిటీలు ఫాలో అవుతున్న ఈ మేకప్‌ లుక్‌లో కొత్తగా కనిపించవచ్చు అంటున్నారు బ్యూటీ బ్లాగర్‌ లతా సునధ్‌. ఈ నయా మేకప్‌ ట్రెండ్స్‌తో సందర్భం ఏదైనా ప్రత్యేక ఆకర్షణగా నిలవండి ఇలా...
 
ఆయిల్డ్‌ సెన్సస్‌ లిప్స్‌: పెదాలకు లిప్‌స్టిక్‌ రుద్దుకోవడం అందరూ చేసేది. ఈసారి కొత్తగా లిప్‌ ఆయిల్స్‌ ట్రై చేయండి. తేలికగా ఉండే ఈ ఆయిల్స్‌ పెదాలను మాయిశ్చరైజ్‌ చేసి మృదువుగా, అందంగా మారుస్తాయి.
 
మెటాలిక్‌ మేకప్‌: కళ్లు, పెదాలనే కాదు బుగ్గలు, గోళ్లను కూడా మెటాలిక్‌ మేకప్‌తో సొగసుగా తీర్చిదిద్దుకోవచ్చు. రెగ్యులర్‌ ఐ షాడో బదులు మెటాలిక్‌ గ్లిట్టర్‌ వాడి కనుబొమలను ఆకర్షణీయంగా మలచుకోవచ్చు. లిప్‌స్టిక్‌ వేసుకున తరువాత కొద్దిగా మెటాలిక్‌ గ్లిట్టర్‌ రాసుకుంటూ పెదాలు మరింత అందంగా కనిపిస్తాయి. నెయిల్‌పాలిష్‌ అయ్యాక గ్లిట్టర్‌ అప్లై చేస్తే గోళ్లు తళుక్కున మెరుస్తాయి.
 
కాఫీ టోన్స్‌: బ్యూటీ ట్రెండ్‌లో కాఫీ టోన్స్‌ ఒకటి. కాఫీ రంగులో ఉండే డార్క్‌ చాకొలేట్‌ లిప్‌స్టిక్‌, బ్రౌన్‌ స్మోకీ ఐస్‌, బ్రాంజ్‌ హైలైటర్‌ కాంబినేషన్‌ ఫ్యాషనబుల్‌గా ఉంటుంది.
 
ఐ లైనర్‌: నియాన్‌ బ్రైట్‌ ఐ లైనర్‌ మీకు బోల్డ్‌, యంగ్‌ లుక్‌ను తెస్తుంది. నియాన్‌లో గ్రాఫిక్‌ లైనర్‌ లేదా ప్రైమరీ కలర్స్‌లో నీలం, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులు ఎంచుకోవాలి. ఐ లైనర్‌ కొంచెం మందంగా వచ్చేలా చూసుకోవాలి.
 
స్మోకీ గ్లిట్టర్‌ ఐస్‌: పార్టీలు, ఫంక్షన్లకు స్మోకీ బ్లాక్‌ గ్రే లేదా బ్లూ, పర్పుల్‌ ఐస్‌ మెటాలిక్‌ ఫినిషింగ్‌ లుక్‌తో వెళితే ప్రత్యేకంగా కనిపిస్తారు.