కాస్మెటిక్స్‌పై కన్నేయండి!

18-07-2019: మేకప్‌ సామగ్రికీ బ్యాక్టీరియా సోకే వీలుంటుంది. అది గమనించకపోతే చర్మ సమస్యలు తప్పవు. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే వాటి జీవిత కాలం
ముగిసేలోపు వాడి, పక్కన పెట్టేయాలి!
 
సమయం లోగా: ఎక్కువ శాతం సౌందర్య సాధనాలు ఒకసారి వాడకం మొదలుపెట్టిన వెంటనే వాటి ఎక్స్‌పైరీ తేదీ వేగం పుంజుకుంటుంది. ఇవి పాడయ్యే విధానం రెండు
విధాలుగా జరుగుతుంది. ఆ సౌందర్య సాధనాల్లో వాడిన పదార్థాలు స్పందించే తత్వం, గాలితో పాటు, చర్మం మీది బ్యాక్టీరియాతో కలిసిన తర్వాత కాస్మెటిక్స్‌లో కలిగే మార్పులు... ఈ రెండు కారణాల మీద కాస్మెటిక్స్‌ షెల్ఫ్‌ లైఫ్‌ ఆధారపడి ఉంటుంది.
 
ఓపెనింగ్‌ డేట్స్‌: కొన్నిటి మీద వాటి మూతలు తెరిచిన తర్వాత ఏ తేదీ లోగా అవి పాడయిపోయే వీలుందో ముద్రించి ఉంటుంది. కాబట్టి ఆ కాలాన్ని గమనించి సౌందర్య సాధానాలను ఉపయోగించాలి
 
పరిమిత కాలం: కొన్ని ఉత్పత్తులు చెప్పిన సమయానికంటే ముందే పాడయిపోతూ ఉంటాయి. చెడు వాసన వచ్చినా, వాటి టెక్చర్‌లో మార్పులు వచ్చినా, లీక్‌
అవుతున్నా, గట్టిపడినా ఆ కాస్మెటిక్‌ పాడైందని గ్రహించాలి.
 
వాడిన వస్తువులు: కాస్మెటిక్స్‌ తయారీలో వాడిన వస్తువులను బట్టి వాటి షెల్ఫ్‌ లైఫ్‌ కనిపెట్టవచ్చు. వాటర్‌ బేస్‌డ్‌ ఉత్పత్తులు ఎక్కువ కాలం మన్నలేవు. పౌడర్ల రూపంలో ఉండేవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. ఇక ప్రిజర్వేటివ్స్‌ వాడకుండా తయారయినవైతే తక్కువ కాలంలోనే పాడవుతాయి.
 
ఎట్రాక్ట్‌గా ఉండగానే సరికాదు: బ్రాండెడ్‌ కాస్మెటిక్స్‌ను పక్కనపెడితే, చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో ఎట్రాక్ట్‌ చేస్తుంటాయి. అయితే వాటి పై మెరుగులకు పడిపోయి కొనడం మంచిది కాదు. ఎప్పుడైనా సరే క్వాలిటీ కాస్మెటిక్స్‌నే కొనాలి.