మేకప్‌ నిలుస్తుందిలా!

12-08-2019: ఈ సీజన్‌లో వర్షంలో తడిస్తే మేకప్‌ ఎక్కడ చెదరిపోతుందనే ఆందోళన సహజం. అయితే వానల్లో కూడా మేకప్‌ నిలిచి ఉండాలంటే మేకప్‌ ప్రొడక్ట్స్‌ను మార్చడమే కాదు వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ ఎంచుకోవడం మేలు. మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమంటే...
 
ఫౌండేషన్‌ వద్దు: హెవీ ఫౌండేషన్‌ వేసుకోవద్దు. బ్యూటీ బామ్‌ లేదా కలర్‌ కరెక్టింగ్‌ క్రీమ్‌ను చాలా తక్కువగా వాడాలి. ఇవి తేలికగా ఉండడమే కాదు తొందరగా కలిసిపోతాయి. బయట తేమగా ఉన్నప్పుడు వీటిని ఎంచుకోవాలి.
 
వాటర్‌ ప్రూఫ్‌ ఐ మేకప్‌: కళ్లకు భారీ మేకప్‌ కాకుండా వాటర్‌ప్రూఫ్‌ ఐ లైనర్స్‌, మస్కారా అప్లై చేయాలి. ఇవి ఎక్కువ సమయం నిలిచి ఉంటాయి.
 
పౌడర్లు బెటర్‌: బ్లషెస్‌, ఐ షాడో కోసం లిక్విడ్‌, క్రీమ్‌ ఉత్పత్తుల బదులు పౌడర్‌ ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి చర్మానికి అతుక్కొని ఉంటాయి. చర్మాన్ని జిడ్డుగా కనిపించనీయవు.
 
మాటిఫైయింగ్‌ పౌడర్‌: మేకప్‌ పూర్తయ్యాక మాటిఫైయింగ్‌ పౌడర్‌తో ఫినిషింగ్‌ వేసుకోవాలి. ఈ పౌడర్‌ మిగిలిపోయిన నూనెలు, తేమను పీల్చుకొని రోజంతా తాజా లుక్‌ను ఇస్తుంది.
 
సెట్టింగ్‌ స్ర్పే: మేకప్‌ను సెట్టింగ్‌ స్ర్పేతో సెట్‌ చేసుకోవచ్చు. దీంతో చర్మానికి తేమ అందడమే కాదు బేస్‌ పాడవకుండా, మేకప్‌
కరిగిపోకుండా చూస్తుంది.