చర్మం మెరుపు కోసం..

24-10-2019: చర్మం మెరవాలంటే చర్మపు తేమను తగ్గించకుండా, మచ్చలు, ముడతలను తగ్గించే ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవాలి. ఇందుకోసం బ్యూటీపార్లర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లోనే ప్యాక్‌ తయారుచేసుకుని వేసుకోవచ్చు. అదెలాగంటే....
బంగాళాదుంపను ముక్కలుగా తరిగి, రెండు టీస్పూన్ల రోజ్‌వాటర్‌ చేర్చి, బ్లెండర్‌లో ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం మీద పూసుకుని, ఆరిన తర్వాత కొద్ది నీళ్లతో తడిపి వేళ్లతో మసాజ్‌ చేయాలి. వృత్తాకారంలో సున్నితంగా మర్దన చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి.
జిడ్డు చర్మం కలిగినవారైతే ఇదే మిశ్రమానికి ఒక టేబుల్‌స్పూను నిమ్మరసం జోడించి వాడాలి.
పొడి చర్మం కలిగినవారైతే ఒక టేబుల్‌స్పూను తేనె కలపాలి.
నార్మల్‌ స్కిన్‌ కలిగినవారు తేనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి వాడుకోవచ్చు.