మెరిసే చర్మం కోసం...

21-10-2019: నార్మల్‌, జిడ్డు చర్మం ఉన్నవారికి బొప్పాయి, తేనె మాస్కు బాగా పనిచేస్తుంది. నార్మల్‌, జిడ్డు చర్మం, మిక్స్డ్‌ చర్మం ఉన్నవారికి టొమాటో, ఓట్‌మీల్‌, పెరుగు మూడు కలిసిన మాస్కు చర్మాన్ని కాంతులీనేలా చేస్తుంది. ఈ మాస్కులను ఇంట్లోనే చేసుకోవచ్చు.
 
బొప్పాయి మాస్కు
బొప్పాయి చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. తేనె కలిపిన బొప్పాయి గుజ్జులో యాంటీబాక్టీరియల్‌ సుగుణాలు ఉండడంతోపాటు చర్మాన్ని పరిరక్షిస్తాయి.
కావలసినవి: బొప్పాయి గుజ్జు రెండు కప్పులు, తేనె టీస్పూను. 
తయారీ: బొప్పాయిపండును బాగా గుజ్జులా చేసి, తేనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకొని 20 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
 

టొమాటో మాస్క్‌

వయసుతో వచ్చే చర్మ సమస్యలకు ఇది బాగా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇందులో యాంటాక్సిడెంట్లు బాగా ఉన్నాయి.
కావలసినవి: టొమాటో- ఒకటి, తాజా పెరుగు- ఒక టీస్పూను, ఓట్‌మీల్‌- ఒక టీస్పూను
తయారీ: టొమాటో పండును రెండు ముక్కలుగా కట్‌ చేయాలి. ఓట్‌మీల్‌ను ఒక బౌల్‌లో తీసుకుని టొమాటో జ్యూసును అందులో పిండాలి. శుభ్రంగా ఉన్న చర్మానికి ఆ పేస్టును రాసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడగాలి.