23-10-2019: పండుగ వేళ ప్రత్యేకంగా కనిపించాలంటే అలంకరణతో పాటు అందానికి మెరుగులద్దడం ముఖ్యమే. అందుకోసం ఇంటివద్దనే చర్మాన్ని తాజాగా, కాంతిమంతంగా మార్చేందుకు అలొవెరా, బాదం పాలు, పసుపు ఫేస్‌ప్యాక్‌ను సిద్ధం చేసుకోవచ్చు.
అలోవెరా ఫేస్‌ప్యాక్: ఇది స్కిన్ టానింగ్‌ను తగ్గిస్తుంది. మలినాలను తొలగించి చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది. అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకోవచ్చు. లేదా దీనిలో కొద్దిగా నిమ్మరసం లేదా పచ్చిపాలు కలిపి వాడినా సరే.
సెనగపిండి, చందనం ప్యాక్: కొద్దిగా ఎర్రచందనంలో రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి, నిమ్మరసం, రోజ్‌వాటర్ వేసి కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖం, మెడ భాగంలో రాసుకోవాలి. మృతకణాలు, చర్మం మీది మలినాలు తొలగి, చర్మం తాజాగా మారుతుంది.
పసుపు, మిల్క్ క్రీమ్ ప్యాక్: పొడిచర్మానికిఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. జిడ్డు చర్మం వారు ఈ ప్యాక్ వేసుకోవద్దు. మిల్క్ క్రీమ్‌లో కొద్దిగా పసుపు, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకొని 10 నిమిషాలయ్యాక కడిగేయాలి. మిల్క్ క్రీమ్‌లోని లాక్టిక్ ఆమ్లం చర్మ తత్వాన్ని, చర్మ స్వభావాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.