అందం.. ఆనందం...

ఆంధ్రజ్యోతి (14-11-2019): కప్పు కాఫీ మెదడును ఉత్సాపరుస్తుందని తెలుసు. అంతేనా కాఫీతో చర్మసౌందర్యాన్ని పెంచుకోవచ్చు కూడా. ఈ సారి బ్యూటీ ఉత్పత్తులకు బదులు కాఫీ పొడి ట్రై చేయండి.

 
మృతకణాలు: కాఫీ గింజలు సహజ ఎక్స్‌ఫోలియేట్‌గా పనిచేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కాఫీ బాడీ స్క్రబ్స్‌ లభిస్తున్నాయి. కాఫీలోని కఫెయిక్‌ ఆసిడ్‌ కొల్లాజెన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది. చర్మం మీది మృతకణాలను తొలగిస్తుంది.
 
మాయిశ్చరైజర్‌గా: యోగర్ట్‌, తేనె రెండు టేబుల్‌ స్పూన్లు, నాలుగు టేబుల్‌ స్పూన్ల కాఫీ పొడిని మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తరువాత చల్లని నీళ్లతో కడుక్కుంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.