చిరుజల్లుల్లో... తళుక్కుమనేలా...

21-08-2019: ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌కు వర్షాకాలం అనువైన సమయం కాదనుకుంటారు చాలామంది. అయితే చిరుజల్లుల వేళ ‘ఇంద్రధనస్సు’లా స్టయిల్‌గా మెరిసిపోవచ్చు. ముదురు రంగు ప్రింట్లు, యాక్సెసరీలు, సరైన ఫుట్‌వేర్‌, హెయిర్‌ స్టయిల్‌తో రెయినీ డేను కొత్తగా ఎంజాయ్‌ చేయొచ్చు అంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్‌ స్వప్నా అనుమోల్‌. ఆమె చెబుతున్న టిప్స్‌...
 
ట్రెంచ్‌ కోట్లు, వివిధ రంగుల్లో లభించే దుస్తులు వర్షాకాలంలో మీ డ్రెస్సింగ్‌ను మరింత కొత్తగా మారుస్తాయి. ఒంటికి గాలి తగిలేలా ఉండే వస్త్రాలు ఈ సీజన్‌కు చక్కగా సరిపోతాయి. పలు రంగులు, డిజైన్లు ఉన్న దుస్తులు కూడా బాగుంటాయి. పొడవైన, యాంకిల్‌ బూట్స్‌తో సమానమైన లుక్‌ను స్కర్ట్స్‌, డ్రెస్సులూ ఇస్తాయి.
ముదురు రంగు వస్త్రాల ఎంపిక మంచి ఛాయిస్‌. ఎరుపు, నీలం, నారింజ రంగు దుస్తులు మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిందే. ఈ సీజన్‌లో తెలుపు రంగు దుస్తులు పర్‌ఫెక్ట్‌ కాదు.
స్లిమ్‌ ఫిట్‌గా ఉన్న డెనిమ్స్‌ ధరించాలి.
బయటకు వెళ్లిన ప్రతిసారి ఒక జాకెట్‌ బ్యాగులో ఉంచుకోవాలి. అదనంగా డ్రెస్‌ ఉండేలా చూసుకోవాలి.
తేలికగా ఉండే రేయాన్‌, పాలీస్టర్‌తో తయారైన దుస్తుల్ని ఎంచుకోవాలి. ఇవి తడిసినా తొందరగా ఆరుతాయి.
జుట్టును ఫ్రీగా వదిలేయకుండా మెస్సీ బ్రెయిడ్‌, పోనీటెయిల్‌ వంటివి ప్రయత్నించాలి.
హీల్స్‌ బదులు మాన్‌సూన్‌ ఫ్రెండ్లీ ఫుట్‌వేర్‌ ఎంచుకోవాలి. రబ్బర్‌ సోల్‌, గ్రిప్స్‌ ఉన్న షూ ధరించాలి. వీటితో వర్షం నీళ్లు నిలిచిన రోడ్ల మీద ఇబ్బంది లేకుండా సాగిపోవచ్చు.
లెదర్‌ ఉత్పత్తులు కొంచెం తేమ తగిలినా తొందరగా పాడయ్యే అవకాశముంది. కాబట్టి ఈ సీజన్‌లో వాటిని వాడకపోవడమే మంచిది.