గ్యాస్ట్రిక్‌ సమస్యలకు హామియో వైద్యం

11-04-2018: గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడేవారిలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ! అందరిలో చెప్పుకోలేని, నలుగురిలో తిరగలేని పరిస్థితి చాలామందిలో ఉంటుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు మానసిక ప్రశాంతతను దెబ్బతీసి, సుఖమయ జీవితానికి ఇబ్బందులు కలిగిస్తాయి. ప్రపంచంలో 40 శాతం జనాభా గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందులో 80 శాతం నాన్‌ అల్సర్‌ డిస్పెప్సియా, ‘జి. ఈ. ఆర్‌. డి.’తో బాధపడుతుంటే, మిగతా 20 శాతం గ్యాస్ట్రిక్‌ అల్సర్‌లు, క్యాన్సర్‌లతో బాధపడుతున్నారు. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ముఖ్యంగా పని ఒత్తిడితో పాటు ఆహార నియమాలు పాటించకపోవడం, శారీరక శ్రమ పెద్దగా లేని వారిలో ఎక్కువగా గమనించవచ్చు.

‘గ్యాస్టరైటిస్‌’ అనగా జీర్ణకోశం లోపల ఉండే మ్యూకోజల్‌ పొర శోథమునకు గురైనప్పుడు - ఆ ప్రదేశంలో వాపు, కమిలిపోవడం, నొప్పి వంటి లక్షణాలు ఏర్పడతాయి. దీనినే ‘గ్యాస్టరైటిస్‌’ అంటారు. కొన్ని సందర్భాలలో జీర్ణకోశంలో ప్రత్యేకించి ఏ వ్యాధి లేకపోయినా ‘గ్యాస్ట్రిక్‌’ సమస్యల లక్షణాలను అనుకరించడాన్ని (ఇమిటేట్‌) ‘ఫంక్షనల్‌ లేదా నాన్‌ అల్సర్‌ డిస్పెప్సియా’ అని అంటారు. మెదడులో ఉన్నట్లే జీర్ణవ్యవస్థలో కూడా అంతే సంఖ్యలో నరాలు ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటివి మెదడుతో బాటు జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. దీనివలన గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
 
గ్యాస్ట్రిక్‌ సమస్యలు కొన్ని రోజుల వరకు ఉండి, ఆ తరువాత తగ్గిపోతే దాని ‘అక్యూట్‌ గ్యాస్టరైటిస్‌’ అంటాము. ఎక్కువ రోజుల పాటు లేదా దీర్ఘకాలికంగా ఈసమస్య బాధిస్తే దానిని ‘క్రానిక్‌ గ్యాస్టరైటిస్‌ అంటాము. కొందరిలో ‘గ్యాస్ట్రిక్‌ సమస్యలు’ ముదిరితే అల్సర్‌లు లేదా పుండ్లు ఏర్పడతాయి. ఇవి కొన్ని సందర్భాలలో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.
 
కారణాలు: ‘గ్యాస్ట్రిక్‌’ ఇన్‌ఫెక్షన్‌లు ముఖ్యంగా ‘హెలికోబాక్టర్‌ పైలోరి’ అనే బ్యాక్టీరియాతో పాటు, మద్యం సేవించటం, కొన్ని రకాల మందులు ముఖ్యంగా నొప్పి నివారణకై ఉపయెగించేవి ఎక్కువగా తీసుకోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. సహజంగా జీర్ణవ్యవస్థలో భాగంగా మనం తిన్న ఆహారం జీవరసాయనాలతో కలిపి జీర్ణమవుతుంది. కానీ కొందరిలో ఒత్తిడికి లోనవడం వలన జీవరసాయనాలు (గ్యాస్ట్రిక్‌ జ్యూసెస్‌) అధికంగా ఉత్పత్తి అవడం వలన ‘గ్యాస్ట్రిక్‌ సమస్యలు’ ఏర్పడే అవకాశం ఉంటుంది. పైత్యరసం వెనక్కి స్రవించడం, వంశపారంపర్యత, సమయానికి ఆహారం తీసుకోకుండా అశ్రద్ధ చేయడం, టీ, కాఫీ వంటివి ఎక్కువగా తీసుకోవడం, ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటి పదార్థాలు ఎక్కువగా వాడటం, జన్యుపరమైన సమస్యలు మొదలైనవి ‘గ్యాస్ట్రిక్‌ సమస్యలకు గల కారణాలు
 
లక్షణాలు: కడుపులో నొప్పి లేదా మంట, ఇది ముఖ్యంగా కడుపు పై భాగంలో వస్తుంది. ఇది ఛాతీ నొప్పి మాదిరిగా ఉంటుంది. కడుపుబ్బరం, తేన్పులు రావడం, కొంచెం తిన్నా కానీ కడుపు నిండినట్లుగా అనిపించడం, వికారం, ఆకలి లేకపోవడం, కొందరిలో గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌ కారణంగా మలం రంగు మారడం, రక్తంతో కూడిన వాంతులు కావటం, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలను గమనించవచ్చు.
 
నిర్ధారణ పరీక్షలు: రోగి యొక్క లక్షణాలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర తెలుసుకోవటం ద్వారా మరియ రక్త పరీక్ష- రక్తంలో హె చ్‌బీ శాతం తెలుసుకోవడం, మలం పరీక్ష - మలంలో రక్త కణాలు, బ్యాక్టీరియా ముఖ్యంగా ‘హెచ్‌పైలోరి’ని పరీక్షించడం, ఎక్స్‌రే, ఎండోస్కోపీ వంటి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు: సమయానికి ఆహారం తీసుకోవడం, మద్యపానం, ధూమపానం వంటివి మానివేయడం, ప్రతి రోజూ వ్యాయామం చేయటం, వేడి కలిగించే పదార్థాలు, కారం, పులుపు, మసాలాలు వంటివి తీసుకోకపోవడం, తిన్న రెండు గంటల తర్వాత నిద్రించటం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ గ్యాస్ట్రిక్‌ సమస్యలను కొంతవరకు అరికట్టవచ్చు.
 
హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ చికిత్స: హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌లో జెనిటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ వైద్యవిధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ఈ విధానం ద్వారా కడుపులో నొప్పి, మంట, కడుపుబ్బరం, తేన్పులు వంటి లక్షణాలను తగ్గించటమే కాకుండా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు మూలకారణమైనటువంటి ఆమ్లాలు, మరియు జీవ రసాయనాల అసమతుల్యతను తిరిగి సమతుల్యంగా మార్చి, జీర్ణవ్యవస్థను శక్తివంతం చేయడం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలను నియంత్రణలో ఉంచే అవకాశం ఉంది.
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్ cmd
హోమియోకేర్ ఇంటర్నేషనల్
టోల్ ఫ్రీ: 18001081212
ఉచిత కన్సల్టేషన్ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి