ఎసిడిటీకి చెక్‌!

22-10-2019: ఛాతీలో మంట, పుల్లని త్రేన్పులు, గొంతులోకి తన్నుకొచ్చే ఆమ్లం... ఎసిడిటీ ప్రధాన లక్షణాలు ఇవి. ఆ మంటను తగ్గించుకోవడం కోసం చల్లని నీళ్లు తాగుతాం, పెరుగు తింటాం. వీలైన చిట్కాలన్నీ ప్రయోగిస్తాం! కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడమే తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేవు. ఎసిడిటీ ఇబ్బందులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే ఇదిగో ఈ యోగాసనం సాధన చేయాలి.
 
మార్జారియాసనం
వెన్ను, పొత్తికడుపు మీద ప్రభావం చూపించే ఆసనమిది. జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణను పెంచి, జీర్ణసంబంధ అవయవాలకు ఈ ఆసనంతో వ్యాయామం దక్కుతుంది. సున్నితమైన మర్దన జరిగి జీర్ణవ్యవస్థ క్రమబద్ధమై, ఎసిడిటీ నుంచి విముక్తి లభిస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే.....
చేతులు, మోకాళ్ల మీద బల్ల ఆకారంలో నేల మీద కూర్చోవాలి.
ఈ భంగిమలో మోకాళ్లు అరడుగు దూరంలో, చేతులు నిటారుగా నేల మీద ఆనించి ఉంచాలి.