జీర్ణశక్తి పెరగకుండా ఆర్శమొలలు పోతాయా?

 
18-06-13
 
ఆర్శమొలలు (పైల్స్‌)రావడానికి అసలు కారణం మలబద్ధ్దకం. దీనికి ఆకలి మందగించడం  అంటే జీర్ణక్రియలు కుంటుపడటమే అసలు కారణం. అందువల్ల తిరిగి  జీర్ణక్రియను పెంపొందించడమే ఆర్శమొలలకు అసలైన వైద్యం అవుతుంది. అందుకే ఆయుర్వేదం జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేయడం ద్వారా ముందు  మలబద్ధకాన్ని నిర్మూలిస్తుంది. ఆ క్రమంలో ఆర్శమొలలు సమూలంగా  తొలగిపోతాయి. ఒకవేళ అప్పటికే మొలలు బాగా ముదిరిపోయినా, జీర్ణవ్యవస్థను పెంచాకే   ‘క్షారసూత్ర’ విధానంతో వాటిని శాశ్వతంగా తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను పెంచకపోతే  సర్జరీ త ర్వాత కూడా  ఆర్శమొలలు మళ్లీ మళ్లీ వస్తాయి. అందుకే జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేయడమే  లక్ష్యంగా చికిత్సచేసే ఆయుర్వేదమే అసలైన మార్గం అంటోంది ఆర్‌.కె. ఆయుర్వేద వైద్య బృందం.
 
ఆకలి తీరడం ఎంత ముఖ్యమో, సంపూర్తిగా  మలవిసర్జన కావడం అంతే ముఖ్యం. మలవిసర్జనకు వె ళ్లాలంటేనే భయంతో వణికిపోయే స్థితిని ఏమనాలి? ఆ స్థితి ఎవరికైనా ఎందుకు వస్తుంది? దానికి ఏకైక కారణం ఆర్శమొలలే. మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ విసర్జన భాగంలో కత్తికోసినట్లయి, బొటబొటా రక్తం పడుతుంటే ఎవరైనా మలవిసర్జనకు ఎలా వెళ్లగలరు? పోనీ ఆపుకోవాలంటే సాధ్యమా? అదీ సాధ్యం కాదుకదా! ఆర్శమొలల బాధితులకు ఇదొక నిరంతర నరకం. 
ఎలా వస్తుందీ సమస్య?
మలం ద్వారం వద్ద మాంసం మొలల్లా తయారు కావడాన్ని ఆర్శమొలలు అంటారు. మలబద్ధ్దకం కారణంగా అదేపనిగా ముక్కడం వల్ల మలద్వారంలో ఉండే సూక్ష్మ రక్తనాళాలు ఉబ్బుతాయి. అలా ఉబ్బినవి బయటికి మొలల్లా పొడుచుకు రావడం వల్లే వీటిని ఆర్శమొలలు అంటారు.  ఆర్శమొలలు పరమశత్రువులా వేధించడం వల్ల కూడా వీటికి అర్శస్సు లేదా ఆర్శమొలలు అన్న పేరు  స్థిరపడింది. ఆర్శమొలలు ఒక దశలో చిట్లిపోయి రక్తస్రావం అవుతుంది. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే అది అనీమియా అంటే రక్తహీనత సమస్యకు దారితీయవచ్చు. అయితే రక్తస్రావం కాకపోయినా కొందరు రక్తహీనత  సమస్యకు గురి అవుతారు. ఆర్శమొలలు ఉన్నవారిలో జీర్ణశక్తి తగ్గడమే కారణం. జీర్ణశక్తి  తగ్గడం వల్ల ఏమీ తినలేక శ క్తిహీనులవుతారు. అదే క్రమంలో వీరికి రక్తహీన త సమస్య కూడా మొదలవుతుంది. రక్తహీనత సమస్య ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి  శరీరం రోగాల నిలయంగా మారుతుంది.
నాలుగు రకాలు
ఆర్శమొలలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అందులో వాతజ అర్చస్సు ఒక టి. ఇవి భరించలేనంత నొప్పిని కలిగిస్తాయి. రెండవది పిత్తజ అర్చస్సు. ఇది మలద్వారం వద్ద బాగా మంట కలిస్తాయి.  రక్త సావ్రం అవుతుంది. ఇక మూడవది శ్లేష్మజ అర్శస్సు. ఇవి విపరీతమైన దురద కలిగిస్తాయి చివరిది సన్నిపాతజ అర్శస్సు. పైన పేర్కొన్న అన్ని లక్షణాలు ఈ అర్శస్సులో కనిపిస్తాయి. అయితే కొన్ని ఆర్శమొలలు  మలద్వారానికి బయట తయారైతే, మరికొన్ని మలద్వారం లోపల ఏర్పడతాయి. మొదట్లో మలద్వారం లోపలే ఉండి బాగా దురదను కలిగిస్తాయి. ఆ తరువాత మలద్వారం నుంచి బయటికి వచ్చి మంటను కలిగిస్తాయి. ఇవి అప్పుడప్పుడు బయటికి వచ్చి వాటంతట అవే లోనికి వెళతాయి. ఆ తరువాత  వాటంతట అవి లోనికి వెళ్లవు కానీ, చేతితో నెట్టినప్పుడు లోనికి వెళతాయి. చివరి దశలో చేతితో లోపలికి నెట్టినా లోనికి వెళ్లకుండా బయటే ఉండిపోతాయి. వీటినే ప్రొలాప్స్డ్‌ పైల్స్‌ అంటారు. ఈ దశలో అర్వమొలలు ఇన్‌ఫెక్షన్లకు గురై భరించలేని నొప్పి, మంట కలిగిస్తాయి.  వీటివల్ల కూర్చోవడమే కాదు, నిలుచోవడం కూడా కష్టమవుతుంది.
ఇవీ కారణాలు
ఆర్శమొలల సమస్య రావడానికి మలబద్ధ్దకంతో పాటు ఎక్కువ బరువులు ఎత్తడం,  పొగతాగడం, అతిగా మద్యపానం చేయడం, అతిగా మాంసాహారం తీసుకోవడం, స్థూలకాయం   ఇవన్నీ కారణాలే. ఆహారంలో పీచుపదార్థాలు  చాలా తక్కువగా ఉండడం కూడా ఒక ప్రదాన కారణమే. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, ఎక్కువ గంటలు డ్రైవింగ్‌ చేస్తూ ఉండిపోవడం కూడా ఆర్శమొలలకు దారి తీయవచ్చు.
ఆయుర్వేద వైద్యం 
జీర్ణ, మల విసర్జన వ్యవస్థల పనితీరు దెబ్బతినడమే  ఆర్శమొలలకు అసలు కారణం. అందువల్ల  ఈ రెండు వ్యవస్థలను సామాన్య స్థితికి  తీసుకురావడం  ప్రధమ లక్ష్యంగా ఆయుర్వేద వైద్యం ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేయడానికి దీపన పాచన ద్రవ్యాలను ఇవ్వడం జరుగుతుంది. మలవిసర్జన వ్యవ స్థను సరిచేయడానికి  వాతనులోమన ద్రవ్యాలను ఇవ్వడం జరుగుతుంది. జీర్ణ వ్యవస్థను, మల విసర్జన వ్యవ స్థల పనితీరును మెరుగుపరచకుండానే ఎవరైనా శస్త్ర చికిత్స చేయించుకుంటే ఏమవుతుంది? సమస్య తాత్కాలికంగా తగ్గినా  కొద్దిరోజులకే సమస్య  మళ్లీ మొదలవుతుంది. ఒకవేళ సమస్య నిజంగానే మందులతో తగ్గే స్థితి దాటిపోయి ఉంటే ఆయుర్వేదంలోని క్షారసూత్ర విధానంతో అర్శమొలలను  సురక్షితంగా, శాశ్వతంగా తొలగించడం  జరుగుతుంది. ఏళ్ల పర్యంత ఆ భాధ భరించడం ఎందుకు? ఒకసారి ఆయుర్వేద చికిత్సలకు వచ్చి చూడండి జీవితంలో ఎప్పుడూ ఆర్శమొలల ఆనవాల్లే కనిపించవు.
 
ఆర్‌.కె. ఆయుర్వేద వైద్య బృందం
ఆర్‌ కె ఆయురే ్వదిక్‌ అండ్‌ సొరియాసిస్‌ సెంటర్‌
క్లినిక్స్‌: హైదరాబాద్‌,విజయవాడ, వైజాగ్‌, హన్మకొండ,కర్నూలు, తిరుపతి 
ఫోన్స్‌:98492 54587, 040-23057483