హోమియో చికిత్సతో జీర్ణ సమస్యలు దూరం

05-04-13

 
కడుపు ఉబ్బరం, తేన్పులు, గుండెలో మంట... గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడే వారి పరిస్థితి ఇది. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అయితే హోమియో వైద్యం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్య సమూలంగా పోతుందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డా. శ్రీకర్‌మను. 
 
మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య దేశపు ఆహార అలవాట్లు, సమయపాలన లేని భోజనం, పోషకాలు అందకపోవడం, మానసిక, శారీరక ఒత్తిడి, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యల బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు ఆహారాన్ని అరిగించి శరీరంలో రక్తం ద్వారా అన్ని కణాల జీవక్రియలకు పౌష్ఠికత చేకూరడానికి సహాయపడుతున్నాయి. ఏదో ఒక కారణం వల్ల అరుగుదలకు ఉపయోగపడే ఆమ్లాలు జీర్ణకోశంపై ప్రభావం చూపినపుడు గ్యాస్ట్రిక్‌ సమస్యలు ప్రారంభమవుతాయి.
కారణాలు
జీర్ణాశయానికి లోపలి వైపున అనేక మ్యూకస్‌పొరలు ఉంటాయి. వీటిలో వాపు, మంట, తాపం ఏర్పడితే దాన్ని గ్యాసై్ట్రటిస్‌గా పరిగణించాలి. ఇది ముదిరితే అల్సర్‌లు, కణితులు వంటివి ఏర్పడటంతో పాటు కొన్ని సార్లు కేన్సర్‌కు కారణం కావచ్చు. జీర్ణాశయ కుడ్యం నుంచి ఎంజైములు, ఆమ్లాలు స్రావితమవుతాయి. ఈ కుడ్యం లేదా గోడకు గ్యాస్ట్రిక్‌ కారణంగా ఇబ్బంది ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఎంజైములు, ఆమ్లాల విడుదలలో ఆలస్యం జరిగి జీర్ణప్రక్రియ కుంటుపడుతుంది. అదే సమయంలో ఇక్కడ మొదలైన ఇన్‌ఫెక్షన్‌ ఇతర ప్రాంతాలకు పాకుతుంది. గ్యాస్ట్రిక్‌ కారణాల్లో మందుల వాడకం, రసాయనాల వినియోగం, ఆల్కహాల్‌ వినియోగం, మద్యం ఎక్కువగా తాగడం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. హెలికోబాక్టర్‌ పైలోరి వంటి బ్యాక్టీరియాల వల్ల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినపుడు కూడా గ్యాస్ట్రిక్‌ సమస్యలు ప్రారంభమవుతాయి. వాస్తవానికి ఈ బ్యాక్టీరియా చాలా మందిలో దాగి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైనపుడు మాత్రం అనేక జీర్ణాశయ సమస్యలకు కారణమవుతుంది. 
థైరాయిడ్‌, పారాథైరాయిడ్‌ అసమతుల్యత, కిడ్నీలో రాళ్లు, కొన్ని రకాల కేన్సర్లు కూడా గ్యాస్ట్రిక్‌ లక్షణాలతో కలిసి ఉంటాయి. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడినపుడు జీర్ణక్రియలో ఎంతో ముఖ్యమైన పిత్తరసం సరియైన రీతిలో పేగుకు చేరకుండా ఉండటం వల్ల అమ్లాల సాంద్రత పెరిగి గ్యాస్ట్రిక్‌ సమస్యకు దారితీస్తుంది. అంతేకాకుండా ఫ్యాటీలివర్‌, హెపటైటిస్‌ వంటివి కూడా గ్యాస్ట్రిక్‌ సమస్యలతో కూడి ఉంటాయి. 
ముఖ్య లక్షణాలు
కడుపు ఉబ్బరం, తేన్పులు, కడుపులో నొప్పి, మంట, గుండెలో మంట, ముఖ్యంగా రాత్రివేళ పడుకున్నప్పుడు ఛాతీలో మంట, ఆహారం అరగకపోవడం, విరేచనాలు వంటి లక్షణాలుంటాయి. వాంతులు, ఆకలిలేకపోవడం, బరువు తగ్గడం, కొంతమందిలో నలుపు రంగులో విరేచనాలు కావడం, రక్తపువాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణాశయ కుడ్యపు అంచుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. దీన్ని ఎరోసివ్‌ గ్యాస్ట్రిక్‌గా వ్యవహరిస్తారు. ఇది బ్లీడింగ్‌, అల్సర్‌కు కారణమవుతుంది. కడుపునొప్పి, వాంతులు, నొప్పితో కూడిన జ్వరం, మూత్రం, మలం రంగు మారడం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ప్రాథమికంగా చెబుతారు. 
కాంప్లికేషన్స్‌
పోషకపదార్థాలు అందకపోవడం వల్ల శరీరంలోని అవయవాలపై ప్రభావం పడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీయును. ముఖ్యంగా అలర్జీలు, ఆర్థరైటిస్‌, స్పాండిలైటిస్‌ వంటి సమస్యలు వచ్చిపడతాయి. సొరియాసిస్‌, గజ్జి, తామర వంటి చర్మసమస్యలు కూడా గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సంయోగంగా శరీరంపైన ప్రభావం చూపిస్తాయి. మలబద్ధకం, పైల్స్‌, ఫిషర్స్‌, ఫిస్టులా వంటివి శరీరనీటి నిల్వలు, పోషకాల లోపాల కారణంగా ప్రారంభమవుతాయి. 
జాగ్రత్తలు
సమయానుసారంగా భోజనం చేయాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, పాలు తీసుకోవాలి. ఆహారం మితంగా తీసుకోవాలి. తిన్న తరువాత పడుకోకుండా కొంతసేపు ఏదో ఒక పనిచేయడం వల్ల పేగుల్లో కదలికలు మెరుగుపడతాయి. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. 
హోమియో వైద్యం
రోగి చెబుతున్న లక్షణాలు, బాల్యం నుంచి నేటి వరకు జరుగుతున్న ముఖ్యమైన శారీరక, మానసిక మార్పులను అర్థం చేసుకొని రోగ మూలాలను శాశ్వత నిర్మూలించే విధంగా చికిత్స అందించడం ద్వారా గ్యాస్ర్టిక్‌ సమస్యను సమూలంగా తొలగించవచ్చు. చాలా మంది తాత్కాలిక ఉపశమనం కోసం ఇతర మందులు వాడటం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించక అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే హోమియో మందుల వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. రోగి జన్యుతత్వాన్ని బట్టి చికిత్స చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో పూర్తికాలం చికిత్స తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
 
డా. శ్రీకర్‌ మను
ఫౌండర్‌ ఆఫ్‌ డా. మనూస్‌ హోమియోపతి,
ఫోన్‌ : 9032 108 108
    9030 339 999