గ్యాస్ర్టిక్‌ , అమీబియాసిస్‌ సమస్యలకు మేలైన వైద్యం

10-6-13: జీవనశైలిలో మార్పుల వల్ల ఎసిడిటి, అల్సర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, భోజన వేళలు పాటించక పోవటం లాంటి కారణాల వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతోపాటు జీర్ణకోశ సమస్యలతో అమీబియాసిస్‌ వ్యాధి వల్ల  విరోచనాలతో సతమతమవుతుంటారు. గ్యాస్ట్రిక్‌, అల్సర్‌, అమీబియాసిస్‌ సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ రవికిరణ్‌.
 

పుల్లటి త్రేన్పులతోపాటు వాంతులవటం,  కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా ఉండటం, ఛాతీ పట్టేసినట్లు ఉండటం గ్యాస్ట్రెటిస్‌, ఎసిడిటి లక్షణాలు. కొంతమందికి కొద్దిగా ఆహారం తీసుకున్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఆకలి లేకపోవటం వల్ల బరువు తగ్గుతారు.

కారణాలు 

 నగర జీవనానికి అలవాటుపడిన వారి ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, కల్తీ, పరిశుభ్రత లేని తినుబండారాలు తినడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ బాధితులను ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి వెంటాడుతుంది. తిన్నది వాంతి చేసుకునే వరకు ఇబ్బందిగానే ఉంటుంది. మానసిక ఆందోళన, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, పరిశుభ్రమైన నీరుతాగడం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం, బయట ఆహారాలు తీసుకోకపోవడం, పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. 

 నివారణ మార్గాలు 

కొన్ని హోమియోపతి మందులు వాడటం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.నక్స్‌వామికా, సల్ఫర్‌, బ్రయోనియా,రొబినియా, చెలిడోనియం, పల్సటిల్లా, మైకోపోడియం వంటి హోమియో మందులు  అన్ని రకాల జీర్ణకోశవ్యాధులను నివారించేందుకు ఉపయోగపడుతాయి. మనిషి లక్షణాలను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఔషధాలను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో పూర్తికాలం వాడినపుడే మంచి ఫలితం ఉంటుంది. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకుంటే అల్సర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

అల్సర్స్‌

అల్సర్స్‌ అంటే పుండు. ఆహార వాహికలో పుండు ఉంటే డైజోఫేజియల్‌ అల్సర్‌ అని, జీర్ణకోశంలో ఉంటే గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ అని అంటారు. ఎసిడిటీ, గ్యాస్ట్రెటిస్‌ సమస్యలకు సరైన చికిత్స తీసుకోనందువల్ల అల్సర్లు వచ్చే అవకాశముంది. 

కారణాలు: పెయిన్‌కిల్లర్స్‌ ఎక్కువగా వాడటం, పచ్చళ్లు, కారం, పులుపు, మసాల, మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల, మానసిక ఒత్తిళ్లు, టెన్షన్‌, నిద్రలేమి, ఒబేసిటీ, ధూమపానం, మద్యపానం, గుట్కా తినడం లాంటి అలవాట్ల వల్ల అల్సర్లు వస్తుంటాయి. 
లక్షణాలు:  కడుపులో నొప్పి, తినే ముందు లేదా తిన్న తర్వాత నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండటం, పుల్లటి త్రేన్పులు, వాంతులు కావటం దీని లక్షణాలు.

నివారణ మార్గాలు : ఆహారపు అలవాట్లను మార్చుకొని, హోమియో వైద్యం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అల్సర్లను శాశ్వతంగా నివారించేందుకు హోమియో మందులు  ఉపకరిస్తాయి. 

అమీబియాసిస్‌, డిసెంట్రి సమస్యలు 

వర్షాకాలం ఆరంభంతో మనం తాగే నీరు కలుషితమై అమీబియాసిస్‌ సమస్యలకు కారణమవుతుంటుంది. చిన్నపిల్లలకు అమీబియాసిస్‌ సమస్య వచ్చిందంటే ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులు, బహిర్భూమి అలవాటు వల్ల అమీబియాసిస్‌ సమస్య ఎక్కువగా ఉంది. జీర్ణకోశ సమస్యలతో పేగులు వాచిపోవటాన్ని డిసెంట్రి అంటారు. దీనివల్ల పలు మార్లు మోషన్‌కు వెళ్లాలని అనిపిస్తుంది. కానీ వెళ్లిన ప్రతిసారి కడుపులో ఏదో లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి విరోచనంతోపాటు రక్తం, జిగట పదార్థం వస్తుంటుంది. ఆహారం అపరిశుభ్రత వల్ల అమీబియాసిస్‌ సమస్య వస్తుంటుంది. 

లక్షణాలు : కడుపునొప్పి, పలుమార్లు విరోచనాలు కావటం, నీరసం, కాళ్లు చేతులు లాగడం, నడుము నొప్పి సమస్యలు ఈ వ్యాధి లక్షణాలు. 

దుష్ప్రభావాలు : అమీబియాసిస్‌ సమస్యకు సరైన చికిత్స తీసుకోనట్లయితే పేగుల్లో పుండ్లు పడే అవకాశం ఉంది. కాలే య సంబంధ సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. చిన్నపిల్లలకు ఈ సమస్య వస్తే 10, 15 సంవత్సరాల వరకు పోదు. 

 

హోమియో వైద్యం 
హోమియోలో అమీబియాసిస్‌ సమస్యకు మంచి చికిత్స విధానం అందుబాటులో ఉంది. నూక్స్‌ వి, బ్రయోనికాతోపాటు ఇతర హోమియో మందులతో అమీబియాసిస్‌ సమస్య పరిష్కారానికి మంచి ఫలితం వస్తుంది. బ్యాడిలరీ డిసెంట్రి వ్యాధి షిజెల్లా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కడుపునొప్పితోపాటు పదిసార్లు మోషన్‌ అవుతుంది. డిసెంట్రి సమస్య పరిష్కారానికి హోమియోలో శాశ్వత చికిత్స ఉంది. ఒకసారి హోమియో మందులు వాడితే మళ్లీ ఈ వ్యాధి పునరావృతం కాదు. 
ముందుజాగ్రత్తలు : అమీబియాసిస్‌తోపాటు జీర్ణకోశ సమస్యలు వస్తే హోమియో చికిత్స తీసుకోవటంతోపాటు కొన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవటం మేలు. మాంసాహారం, ఆయిల్‌ ఫుడ్‌, స్పైసీ ఫుడ్‌, మసాలాలకు దూరంగా ఉండాలి. 
 
డాక్టర్‌ రవికిరణ్‌ 
ప్రముఖ హోమియో వైద్యనిపుణులు
మాస్టర్స్‌ హోమియోపతి
అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి,
 హైదరాబాద్‌, విజయవాడ
ఫోన్‌ : 7842 106 106
        9032 106 106