కడుపు ఉబ్బరం కష్టాల నుంచి శాశ్వత విముక్తి

ఆంధ్రజ్యోతి, 07-05-13: ఎప్పుడూ ఉండే గ్యాస్ట్రిక్ సమస్యలే కదా అని ఎవరైనా ఎక్కువ కాలం నిర్లక్ష్యంగా ఉండిపోతే ఏమవుతుంది? ఏదో ఒక రోజున అది అల్సర్‌గానూ ఆ తరువాత కేన్సర్‌గానూ మారే ప్రమాదం ఏర్పడుతుంది. వాస్తవానికి మనిషి రోగగ్రస్తం కావడం వెనుక జీర్ణాశయమే ప్రధాన కేంద్రంగా ఉంటుంది. దాదాపు 60 శాతం వ్యాధులకు బీజం ఇక్కడే పడుతుంది. ఆహార పదార్థాల లోపాలతో పాటు, శరీర శ్రమలేని తనం, నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లు ఈ సమస్యకు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ఈ సమస్యలన్నిటినీ సమూలంగా నిర్మూలించే సామర్థ్యం, తాత్కాలికంగా కాకుండా సమస్యను శాశ్వతంగా తొలగించే శక్తి ఒక్క ఆయుర్వేదానికే ఉంది అంటున్నారు, ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ కె.రఘురాముడు. 
 
ఆకలి తగ్గితే, ఆయుశ్శు తగ్గినట్లే అంటారు ఆయుర్వేద పండితులు. ఆకలి తగ్గడానికి అసలు కారణం జఠరాగ్ని తగ్గడమే. ఆకలి తగ్గితే, తీసుకున్న ఏ ఆహార పదార్థమూ సంపూర్ణంగా జీర్ణం కాదు. సగం సగంగా జీర్ణమైన ఆహార పదార్థాలు కడుపులో పులిసిపోయి కడుపు ఉబ్బరం సమస్యకు కారణమవుతాయి. శరీరాన్ని విషతుల్యం చేస్తాయి, అందుకే శరీరంలోని ఆ విషపదార్థాలన్నీ ఆకలిని పెంచే దిశగా ఆయుర్వేదం అడుగులు వేస్తుంది. 
 
కడుపు ఉబ్బరం సమస్యకు అవసరానికి మించి తినడం ఒక కారణమైతే, తిన్న ఆ కాస్త కూడా జీర్ణమయ్యేటంత శ్రమ లేకపోవడం మరో కారణం. జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహార పదార్థాలు కడుపులోనే పులిసిపోయి కొన్ని రకాల చెడు వాయువులు ఉత్పన్నమై పొట్టలో నిండిపోతాయి. అవి ఇబ్బంది పెట్టే స్థాయికి చేరడాన్నే గ్యాస్‌ స్ట్రబుల్‌ అంటారు. ఆయుర్వేద పరిభాషలో దీన్నే ఆద్మానం అంటారు.
 
కారణాలు 
 
కార్బోహైడ్రేట్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకున్నప్పుడు వాటిని జీర్ణించుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఎంజైమ్స్‌ అవసరమవుతాయి. అయితే అవసరమైన మోతాదులో ఎంజైమ్స్‌ లేనప్పుడు ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకుండా మిగిలిపోతాయి. అలామిగిలిపోయిన కార్బోహైడ్రేట్స్‌తో కొలికో బ్యాక్టీరియా పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల వాయువులు వెలువడతాయి. దీనికి తోడు జీర్ణశక్తికి మించి ఆహారం తీసుకోవడం, మరీ ఎక్కువ సేపు భోజనం చేయడం, భోజనం సమయంలో మాట్లాడటం. అతి వేగంగా భుజించడం, జంక్‌ ఫుడ్స్‌ పులిసిన పదార్థాలతో తయారుచేసే ఆహారం సేవించడం, శరీరంలోంచి విడుదల అయ్యే చెడు వాయువులను బలవంతంగా ఆపివేయడం కొన్ని ముఖ్యమైన కారణాలు. వీటితో పాటు అతిగా మద్యపానం చేయడం, పొగతాగడం, పొగాకుకు సంబంధిత ఉత్పత్తులను నమలడం, దిగులు, ఆందోళన, మానసిక ఒత్తిడి కొన్ని కారణాలు. జీర్ణం కాని ఆహార పదార్థాలు, మానసిక ఒత్తిళ్లు వాత ప్రకోపానికి దారి తీస్తాయి. ఆ వాత ప్రకోపమే అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది.
 
లక్షణాలు
 
కడుపు ఉబ్బరం, ఏకొంచెం తిన్నా కడుపు నిండినట్లుగా ఉండడం, కడుపులో ఆయాసంగా ఉండడం, కడుపులోనూ, ఛాతీలోనూ నొప్పి అనిపించడం, ఆకలి మందగించడం, వికారం, వాంతి వస్తున్న భావన కలగడం, లేదా వాంతి రావడం వంటివి ప్రధాన లక్షణాలు. మలబద్దకం, పుల్లని తేన్పులు రావడం, మలద్వారం నుంచి వాయువులు విడుదల కావడం, తరుచూ వెక్కిళ్లు రావడం వంటి లక్షణాలు కూడా వీరిలో కనిపిస్తాయి. అల్సర్లు రెండు రకాలు వాటిలో అన్నద్రవ శూల, పరిణామ శూల అని రెండు రకాలుగా ఉంటాయి. అన్నద్రవశూల ఎప్పుడైనా రావచ్చు కానీ , పరిణామా శూల మాత్రం భోజనం అయిపోయి, జీర్ణక్రియ మొదలైన తరువాత మొదలవుతుంది.కడుపు ఉబ్బరం వల్ల కడుపులో ఉండే శ్లేష్మక పొర ( మ్యూకస్‌ మెంబ్రేన్‌) మీద కొన్నిసార్లు పొక్కుల్లాంటివి ఏర్పడతాయి. ఈ పొక్కులు ముందు అల్సర్‌గానూ ఎక్కువ కాలం నిర్లక్ష్యంగా ఉండిపోతే అవి కేన్సర్‌గానూ మారే ప్రమాదం ఉంది.
 
వ్యాధి నిర్ధారణ 
 
కడుపు ఉబ్బరం సమస్య ఉన్నచాలా మందిలో మలబద్దకం సమస్య కూడా ఉంటుంది. దీర్ఘకాలికమైన మలబద్దకం వల్ల అర్శమొలలు, భగందరం, మలద్వారం వద్ద కేన్సర్‌ వచ్చే ప్రమాదమూ ఉంది. అందుకే కడుపుఉబ్బరం సమస్య విషయంలో ప్రారంభంలోనే వద్యై పరీక్షలకు వెళ్లడం చాలా అవసరం.ఎండోస్కోపీ గానీ, ఆలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ గానీ చేయడం ద్వారా కడుపు ఉబ్బరం సమస్య ఏ దశలో ఉందో గుర్తించడం సాధ్యమవుతుంది.
 
ఆయుర్వేద వైద్యం 
 
ఆయుర్వేదంలో చికిత్సా విధానాలు శమన చికిత్సలు శోధన చికిత్సలు, అంటూ రెండు రకాలు. మాత్రల రూపంలో మందులు ఇవ్వడం శమన చికిత్స. అంటే దీపన పాచన చికిత్సల ద్వారా ఈ సమస్యను తగ్గించడం సాధ్యమవుతుంది. ఒకవేళ సమస్య అప్పటికే తీవ్రరూపంలో ఉంటే అప్పుడు శోధన చికిత్సలు అవసరమవుతాయి. శోధన చికిత్సలో ప్రధానంగా పంచకర్మ చికిత్స భూమిక కీలకంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం సమస్యను శాశ్వతంగా తొలగించడంలో వస్తి చికిత్స పాత్ర కీలకంగా ఉంటుంది. అందులో ప్రత్యేకించి క్షీరవస్తి చికిత్స గొప్పగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం సమస్యను తాత్కాలికంగా కాకుండా, శాశ్వతంగా తొలగించడంలో ఆయుర్వేదం ఎంతో అద్భుతంగా పనిచేస్తుందనేది ఒక తిరుగులేని సత్యం. 
 
 
 
డాక్టర్‌ కె. రఘురాముడు 
ఆర్‌ కె ఆయుర్వేదిక్ అండ్‌ సొరియాసిస్‌ సెంటర్‌ 
క్లినిక్స్‌: హైదరాబాద్‌,విజయవాడ, వైజాగ్‌, హన్మకొండ,కర్నూలు, తిరుపతి
ఫోన్స్‌:98492 54587, 040-23057483