అజీర్తి వేధిస్తోందా?

ఆంధ్రజ్యోతి(17-10-2016): అజీర్తి సమస్య వేధిస్తోందా? తేన్పులు, పొట్ట ఉబ్బరం ఎంతకీ తగ్గడం లేదా? అయితే ఇలా చేసి చూడండి. 
పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోండి. పొట్ట నిండిన ఫీలింగ్‌ రావడానికి, జీర్ణక్రియ బాగా జరగడానికి పీచుపదార్థాలు బాగా ఉపయోగపడతాయు.
తాజా పండ్లు, నట్స్‌, ఆకుకూరలు ఎక్కువగా తినండి. మసాలాలు, వేయించిన పదార్థాలు, వెన్నతో చేసిన ఆహారపదార్థాలకు పూర్తిగా స్వస్తి చెప్పండి.
భోజనం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సమయానికి భోజనం చేయకపోతే శరీరం కొవ్వును నిలువ చేసుకుంటుంది. అంతేకాకుండా సమయం తప్పిన తరువాత తిన్నట్లయితే ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి భోజనం చేసేయండి.
ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగండి. భోజనం పూర్తి కాగానే ఫుల్‌గా నీళ్లు తాగేస్తుంటారు. అలాకాకుండా భోజనం పూర్తయిన అరగంట తరువాత నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది.
మలబద్ధకం లేకుండా చూసుకోండి. మలవిసర్జన సాఫీగా లేకపోతే జీర్ణసమస్యలే కాదు, అనేక సమస్యలు మొదలవుతాయి.