ఎసిడిటీకి అద్భుత చికిత్స
ఆంధ్రజ్యోతి, 05/10/14: మారిన ఆహారపు అలవాట్లు, కొరవడిన వ్యాయామం, మానసిక ఒత్తిళ్ల కారణంగా చాలా మంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే సమస్య పట్ల ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హోమియో చికిత్స తీసుకుంటే ఎసిడిటీ బాధతోపాటు దాని వల్ల వచ్చే ఇతర దుష్పరిణామాలను కూడా నివారించవచ్చంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి.
 
కడుపంతా ఉబ్బరంగా ఉంటూ, అస్తమాను తేన్పులు రావడం, ఎప్పుడూ ఏదో ఆయాసంగా అనిపించడం ఎవరికైనా పరమ చిరాకు కలిగిస్తాయి. ఎంత వద్దనుకున్నా ఎసిడిటీ సమస్యతో వచ్చే బాధలే ఇవి. ఎసిడిటి లేదా కడుపు ఉబ్బరం అనేది సాధారణంగా కడుపులో ఆసిడ్‌ ఎక్కువగా విడుదల కావడం వల్ల వచ్చే సమస్య. దీన్నే హైపర్‌ ఆసిడిటీ అని కూడా పిలుస్తారు. ప్రత్యేకించి కడుపులో సహజంగా ఉత్పన్నమయ్యే హైడ్రోక్లోరైడ్‌ విడుదలలోని కొన్ని లోపాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. తొలిదశలోనే గుర్తించి అవసరమైన చికిత్సలు తీసుకోకపోతే ఈ సమస్య కొన్నిసార్లు మరికొన్ని ఇతర వ్యాధులకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. వాటిలో ముఖ్యంగా స్టమక్‌ అల్సర్‌, ఆసిడ్‌ రిఫ్లెక్స్‌ డిసీజ్‌ వచ్చే వీలుంది. అరుదుగానే అయినా ఇది కొన్నిసార్లు స్టమక్‌ కేన్సర్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది.
 
ఇవీ కారణాలు 
ఆతిగా, తరచూ తినే అలవాటు, మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకం, వక్కపొడి, గుట్కా, పాన్‌మసాలాలు, ఛాట్‌, జంక్‌ఫుడ్‌, పొగాకు నమలడం, పొగతాగడం, జర్దా, దీర్ఘకాలికంగా వాడే కొన్ని ముందులు, తరుచూ పెయిన్‌కిల్లర్స్‌, యాంటీ బయాటిక్స్‌ వాడటం ఆసిడిటీ సమస్యకు కారణమవుతాయి. అలాగే పుల్లటి ఆహారం, పుల్లటి పండ్లు, పుల్లటి పెరుగు, ఎక్కువ మోతాదులో కారం, మసాలాలు వాడటం, ఎక్కువగా టీ, కాఫీలు సేవించడం, అతిగా శీతల పానీయాలు సేవించడం, నిద్రలేమి వంటివి కూడా ఈ సమస్యకు కారణాలుగా ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు, నిరంతరమైన దిగులు ఆందోళన కూడా ఇందుకు కారణం కావచ్చు.
 
వ్యాధి లక్షణాలు 
లాలాజలం అతిగా ఉత్పన్నం కావడం, తిన్న ఆహార పదార్థాలు తిరిగి నోటిలోకి రావడం, ఛాతీలో, గొంతులో మంట. కడుపు నొప్పి, ఛాతీలో నొక్కినట్లు ఉండడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తరుచూ తేన్పులు రావడం, ఒళ్లంతా చెమట పట్టటం, దడ. కోపం, చిరాకు, ఎప్పుడూ విరేచనం వస్తున్నట్ల్లు ఉండడం, అధిక దాహం, కడుపులో ఆయాసం, నోరు నాలుక ఎండిపోవడం, నీరసం, పనిచేయలేకపోవడం, వంటి సమస్యలు కూడా వీరిలో ఎక్కువగానే ఉంటాయి.
 
శరీర వ్యవస్థలో.... 
శరీరంలోని కొన్ని అంతర్గత సమస్యలు కూడా ఎసిడిటీని కలిగించవచ్చు. వాటిలో అన్నవాహిక కుంచించుకుపోవడం, లేదా వాచిపోవడం, జీర్ణాశయంలో కణతులు ఏర్పడటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు అన్నవాహికలో అడ్డంకులు ఏర్పడటం, గాలిని అతిగా మింగే అలవాటు, అల్సర్లు, పిత్తాశయంలో రాళ్లు, వాపు, లివర్‌ జబ్బులు కూడా ఎసిడిటీ సమస్యను కలిగించవచ్చు.
 
వ్యాధి నిర్ధారణ 
ఎక్స్‌రే, రక్తపరీక్ష, మలపరీక్ష, మూత్ర పరీక్ష, ఆలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌, ఎండోస్కోపీ, లివర్‌ ఫంక్షన్‌ టెస్ల్‌ ఈ పరీక్షల ద్వారా ఎసిడిటీ సమస్యను దాని తీవ్రతనూ అంచనా వేయవచ్చు. వాటి ఆధారంగా వైద్య చికిత్సలు చేస్తే ఎంతో త్వరితంగా సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అటు శారీరక కార ణాలనూ ఇటు మానసిక కారణాలనూ విశ్లేషించి వైద్య చికిత్సలు అందిస్తే ఎసిడిటీ సమస్య సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది.
 
నివారణా మార్గాలు 
జీవనశైలి మార్పుల ద్వారానే కొంత మేరకు ఎసిడిటీ సమస్యను నివారించే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా స్వచ్ఛమైన శుద్ధమైన ఆహారం తీసుకోవడం, నిర్ణీత ఆహారపు వేళలు పాటించడం చాలా అవసరం. అలాగే నూనె, మసాలా పదార్థాలను అతిగా తీసుకోకుండా ఉండడం, క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం. వీటన్నిటితో పాటు మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి యోగా, మెడిటేషన్‌ చేయడం తప్పనిసరి.
 
హోమియో వైద్యం 
ఎసిడిటీ సమస్యను సమూలంగా తొలగించడంలో హోమియోపతి మందులు అద్భుతంగా పనిచేస్తాయి.. కడుపులో ఆమ్లాలు సరైన పాళ్లలో విడుదల అయ్యేందుకు, కాలేయ, జీర్ణాశయ వ్యవస్థలను సరిచే యడం ద్వారా ఎసిడిటీని తగ్గించడానికి ఈ మందులు తోడ్పడతాయి. శరీర తత్వాన్ని పరిశీలించి మందులు సూచించే హోమియో వైద్య విధానం సమర్థవంతంగా పనిచేస్తుంది. హోమియో మందుల్లో ఆసిడ్‌ సల్ఫ్‌, నక్స్‌వామికా, ఎబిస్‌నైగ్ర, చైన, రీచిన రెఫనన్‌ వంటి మందులు ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. వైద్య చికిత్సలతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటే ఎసిడిటీ సమస్య నుంచి సంపూర్ణంగా బయటపడే అవకాశాలు కచ్ఛితంగా ఉంటాయి. 


డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి 
ఎం.డి., హోమియో 
స్టార్‌ హోమియోపతి 
సికింద్రాబాద్‌ 
ఫోన్‌: 8977336677
www.starhomeo.com

email:[email protected]