విటిలిగో సమస్య ఆయుర్వేదంతో దూరం

ఆంధ్రజ్యోతి,11-9-2016:ఆయుర్వేద వైద్యంలో విటిలిగో వ్యాధిని శ్వేతకుష్టం అని అంటారు. వాడుక భాషలో బొల్లి అంటారు. శరీరానికి చర్మం ఒకే కవచంలాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్ద అవయవం. ఇది 2 నుంచి 3 మి.మీ మందం ఉంటుంది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, మెలనోసైట్స్‌, నరాలుంటాయి. ఇటువంటి చర్మం తెల్లమచ్చల బారినపడటం తీవ్రమైన మానసిక ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. ఈ వ్యాధి ఉన్న వారు నలుగురిలో కలవటానికి ఇబ్బందికి గురిఅవుతారు.

వ్యాధి కారకాలు 
జీన్స్‌లో తేడా వల్ల మన రక్షణ వ్యవస్థ మెలనోసైట్స్‌పైన దాడి చేయటం వల్ల ఆ ప్రాంతంలో మెలనోసైట్స్‌ నశించి ఆ ప్రాంతం తెల్లబడి మచ్చలు ఏర్పడతాయి. సీ్త్ర, పురుషులు అనే తేడా లేకుండా విటిలిగో అనే వ్యాధి సంభవిస్తుంది. 
కాలిన గాయాలు, ప్రమాదం జరిగినపుడు ఏర్పడ్డ గాయాలు 
ఒత్తిడి వల్ల
జీర్ణాశయ వ్యవస్థలో ఏర్పడ్డ ఇన్‌ఫెక్షన్ల వల్ల
కాలేయ విధుల అంతరాయం వల్ల
పొగతాగడం
బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం వల్ల
గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉన్న వారిలో
జన్యుపరమైన కారణాలు, కాస్మోటిక్స్‌ మితిమీరి వాడటం వల్ల

 

ఎండ వేడిమి

ఇవే కాకుండా చర్మం, వెంట్రుకలు, కళ్లరంగు ఇవన్నీ మెలనిన హార్మోన ఉత్పత్తి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మెలనిన ఉత్పత్తి తగ్గితే రంగు మారుతుంది. ఈ విధంగా తెల్ల మచ్చలు ఏర్పడుతాయి. థైరాయిడ్‌, టైప్‌1 డయాబెటిస్‌, అమీబియాసిస్‌ వల్ల రావచ్చు. 
కొంతమందిలో ఆటో ఇమ్యూన సిస్టమ్‌ దెబ్బతిన్నప్పుడు డీపిగ్మెంటేషనకి గురి అవుతారు. ఇది కణిజాలపై వ్యతిరేకంగా పనిచేయటం వల్ల మెలనిమైట్స్‌ నశించి విటిలిగో రావచ్చు.
లక్షణాలు 
మొదట చిన్నచిన్న మచ్చలుగా ఏర్పడి ఆ తరువాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరికి తెలుపు రంగులోకి మారుతాయి. చర్మం పలచబడినట్లు ఉంటుంది. కొన్నిసార్లు విపరీతమైన ఎండను తట్టుకోలేదు. జుట్టు రంగుమారటం, రాలిపోవటం, శారీరకంగా అలసిపోవటం లాంటి లక్షణాలుంటాయి. 
ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్లమీద రావచ్చు. ఇవి పెరగొచ్చు కూడా. లేదా అంతేపరిమాణంలోనూ ఉండొచ్చు.
 
నిర్ధారణ 
రోగి శరీర, మానసిక, వంశపారంపర్య చరిత్ర ఆధారంగా రోగ నిర్ధారణ చేయవచ్చు.
 
చికిత్స 
ఆయుర్వేద వైద్యానుసారం దూషించబడిన వాత, పిత్త, కఫ లోపాలను సమస్థితిలోకి తీసుకుని వచ్చే ఔషధాలు అద్భుతమైన లేపనాలు, పంచకర్మ విధానాలు ఉన్నాయి. వ్యాధి ఆరంభంలోనే రోగి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి వ్యాధిని పూర్తిగా నివారించుకోచ్చు. 
 
 
డా. మనోహర్‌, ఎండి. ఆయుర్వేద
స్టార్‌ ఆయుర్వేద
ఫోన్‌ : 8977336677
టోల్‌ఫ్రీ నం : 1800-108-5566
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక
www.starayurveda.com