వీర్యకణాల లోపాలను ఆయుర్వేదంతో అధిగమిద్దాం

ఆంధ్రజ్యోతి, 02/07/2013: సంతానంతోనే సమాజంలో గౌరవం, హోదా. అందుకే పిల్లల కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుపోతుంటారు. పిల్లలు లేని దంపతులు సంతానం కోసం నానా ప్రయత్నాలూ చేస్తుంటారు. సంతానలేమికి పురుషుల్లో వీర్యకణాల లోపాలు కారణమవుతుంటాయి. అయితే లోపాలు ఏవైనా ఆయుర్వేద చికిత్సతో వాటిని అధిగమించవచ్చని, సంతానం కలిగేలా చేయవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్‌ ఎం.నరసింహ. 


సంతానలేమి సమస్యతో 15 నుంచి 20 శాతం దంపతులు బాధపడుతున్నారు. ఈ సమస్య దంపతుల్లో పెనుభూతంగా మారుతోంది. వీర్యంలో వీర్యకణాల సంఖ్య పూర్తిగా లేకపోవడాన్ని అజోస్పెర్మియాగా చెప్పవచ్చు. వీర్యకణాల సంఖ్య ప్రతి మిల్లీలీటరుకు 40 నుంచి 120 మిలియన్‌లుంటాయి. వీర్యకణాల కదలికలు కనీసం 50 శాతం వరకు, సరైన ఆకృతి కలిగినవి 60 శాతం వరకు ఉంటే సంతానం కలుగుతుంది.
 
సంతానలేమికి కారణాలు 
పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి పలు కారణాలున్నాయి. శారీరక కారణాలు, మానసిక కారణాలు రెండూ ఉంటాయి. మానసిక ఒత్తిడికి లోనవడం, మానసిక ఆందోళన, డిప్రెషన్‌కు లోనుకావటం వల్ల వీర్యకణాల్లో లోపాలు ఏర్పడతాయి. గవద బిళ్లలు రావడం, క్షయ, మశూచి వల్ల వీర్యకణాల ఉత్పత్తి మందగిస్తుంది. వృషణాల్లో వెరికోసిల్‌ ఉండటం వల్ల వృషణాలకు వేడి పెరిగి వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గిపోతాయి. పొగ తాగడం, మద్యం సేవించటం, గుట్కాలు నమలడం వల్ల కూడా వీర్యకణాల్లో లోపాలు ఏర్పడతాయి. హార్మోన్‌లలో లోపాలు, వృషణాల్లో వచ్చే సమస్యలు, సుఖవ్యాధులు, అంగస్తంబనలో లోపాలు మొదలగునవి పురుషుల్లో సంతానలేమికి కారణమవుతాయని చెప్పవచ్చు. ఇవేకాకుండా, అధిక బరువు, మధుమేహం వంటి సమస్యల వల్ల కూడా వీర్యకణాల్లో లోపాలేర్పడతాయి. ఇంకా ఆహార అలవాట్లు, కాలుష్యం, రసాయనాల వల్ల కూడా వీర్యకణాలు తగ్గిపోతాయి.
 
వ్యాధి నిర్ధారణ 
పురుషుల్లో సంతానలేమికి వీర్య పరీక్ష, హార్మోన్‌ల పరీక్ష, స్ర్కోటల్‌ డాప్లర్‌ స్టడీ వంటి పరీక్షలు వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి. సంతానం కలగని దంపతులు మొట్టమొదట వీర్య పరీక్ష చేయించుకోవాలి. ఈ వీర్య పరీక్ష చేయించుకోవడానికి 3 నుంచి 5 రోజులు భార్యాభర్తలు దాంపత్యానికి దూరంగా ఉండాలి. ఆ తరువాతే పరీక్ష చేయించుకోవాలి. స్ర్కోటల్‌ డాప్లర్‌ స్టడీ ద్వారా వృషణాల్లో వచ్చే వెరికోసిల్‌ను గుర్తిస్తారు. వెరికోసిల్‌ సమస్యకు గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 3లలో గుర్తిస్తారు. వెరికోసిల్‌ ఉన్న వారిలో ముఖ్యంగా వీర్యకణాల కదలికల్లో లోపాలేర్పడతాయి. వెరికోసిల్‌ ఎక్కువగా ఎడమ వృషణానికే వస్తుంది.
 
ఆయుర్వేద చికిత్స 
సంతానలేమిని ఆయుర్వేదంలో వంధ్యత్వమని పేర్కొన్నారు. పురుషుల్లో సంతానలేమిని శుక్ర దోషాలుగా చెప్పవచ్చు. వీర్యకణాలను పెంచే అద్భుతమైన ఔషధాలు ఎన్నో ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్నారు. శృంగార సమస్యలకు, సంతానలేమి సమస్యలకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వాజీకరణ ఔషధాలు ఉన్నాయి. శుక్ర దోషాలను 8 రకాలుగా చెప్పారు. ఇవి వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాల వల్ల ఏర్పడతాయని ఆయుర్వేదశాస్త్రంలో వివరించారు.
వాజీకరణ ఔషధాలు 4 రకాలు ఉన్నాయి.
1. శుక్ర జనకాలు: ఇవి వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. వీటిలో అశ్వగంధ, శతవరి, జీవకం మొదలైనవి ఉన్నాయి. 
2. శుక్ర ప్రవర్తకాలు: ఇవి వీర్యాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తాయి. వీటిలో బృహతి, కంటకారిలను పేర్కొనవచ్చు. 
3. శుక్ర జనక, ప్రవర్తకాలు: వీటిలో జీడిపప్పు, మినుములు, పాలు చెప్పవచ్చు. 
4. శుక్ర బోధకాలు: వీర్యంలోని దోషాలను నివారించేవి. వీటిలో కోకిలాక్ష, కూష్మాండ, ఉసిర, చెరకు రసం చెప్పవచ్చు.
పురుషుల వీర్యంలో ఎలాంటి లోపాలున్నా ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చు. ఔషఽధాలతో పాటు మానసిక ఆందోళనలను తగ్గించుకొని, ఆహారం, వ్యాయామం విషయంలో శ్రద్ధ వహించాలి. సంతాన, శృంగార సమస్యలపై అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా ఔషధాలు వాడినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.


డాక్టర్‌ ఎం. నరసింహ 
ఎం.డి (ఆయుర్వేద), సెక్సాలజిస్ట్‌ 
యస్‌.బి. స్పెషాలిటీ క్లినిక్‌ 
అమీర్‌పేట్‌, హైదరాబాద్‌, 
బ్రాంచీలు : విజయవాడ,తిరుపతి 
ఫోన్స్‌ : 924656 4433 
939656 4433