కూల్‌డ్రింక్స్‌ తాగితే..?

ఆంధ్రజ్యోతి, 21/12/14: మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చిన వెంటనే వారికి మంచినీరు ఇచ్చి స్వాగతం పలికే సంప్రదాయం మనది. లేదా మజ్జిగ ఇచ్చి దాహం తీర్చే సంస్కృతి మనది. ఏమీ చదువుకోని మన పెద్దలు ఎంతో మంచి అలవాట్లను మనకు నేర్పారు. మనం ఈ రోజు బాగా చదువుకొని ఏం నేర్పుతున్నాం, ఏం చేస్తున్నామంటే ఇంటికొచ్చిన అతిఽథులకు, మన పిల్లలకు కూల్‌డ్రింక్సు పేరు చెప్పి చల్లటి విష పదార్థాన్ని ఇస్తున్నాం. కూల్‌డ్రింకు సీసాలను పెద్దమొత్తంలో తెచ్చుకొని ఇంట్లో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి ఆనందంగా తాగుతున్నాం. ఏదన్నా ఒకటి డబ్బు పెట్టి కొని తిన్నామన్నా, తాగామన్నా దాని ద్వారా మనకు రుచితో, ఆనందంతో పాటు కొద్దిగా ఆరోగ్యం లభిస్తే పరవాలేదనుకోవచ్చు. 

ఒక పదార్థంలో ఆమ్లగుణం ఉన్నదా? క్షారగుణం ఉన్నదా? ఏది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి పిహెచ్‌ మీటరు సహకరిస్తుంది. పిహెచ్‌ అనేది 7 కంటే ఎక్కువగా ఉంటే క్షారగుణమని, 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లగుణమని (యాసిడ్‌) తెలుస్తుంది. ఏ పదార్థంలోనన్నా ఆ పిహెచ్‌ మీటరును ముంచితే ఆ పదార్థం ఏ స్థితిలో ఉన్నది. అందులో నుంచి వచ్చే అంకెను బట్టి తెలిసిపోతుంది. కూల్‌డ్రింక్‌ను గ్లాసులో పోసి ఆ మీటరు ముంచితే వాటి బండారం బయటపడుతుంది. ఇప్పుడు మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పది రకాల కూల్‌డ్రింకులను పరీక్షిస్తే వాటి పిహెచ్‌ అనేది 1.1 నుంచి 2.0 మధ్యలోనే అన్నింటికి ఉంటున్నది. తియ్యగా ఉండే వాటిలో, పుల్లపుల్లగా ఉండే వాటిలో కూడా అంత యాసిడ్‌ ఉన్నట్లుగా తెలుస్తున్నది. మనం లెట్రిన్స్‌ను శుభ్రం చేసుకునే యాసిడ్‌ సీసాలను చూసి ఉంటారు. ఆ యాసిడ్‌ యొక్క పిహెచ్‌ చూస్తే 1.5 నుంచి 2.0 మధ్యలో ఉంటుంది. అంటే యాసిడ్‌ యొక్క పిహెచ్‌ చూస్తే 1.5 నుంచి 2.0 మధ్యలో ఉంటుంది. అంటే ఆ యాసిడ్‌ అంత ఘాటుగా ఉంటుంది. కాబట్టే ఎండిపోయిన మలంపై పోస్తే శుభ్రంగా తినేస్తుంది. మనం తాగే కూల్‌డ్రింక్‌ సీసాలు కూడా లెట్రిన్‌ క్లీన్‌ చేసే యాసిడ్‌తో సమానంగా ఆమ్లగుణాన్ని కలిగి ఉన్నాయి. మీరు ఓసారి లెట్రిన్‌ బాగా మరకలు పడి ఎండిపోయినపుడు దానిపై యాసిడ్‌ పోయకుండా కూల్‌డ్రింకు పోసి అయిదు నిమిషాలు ఆగి శుభ్రం చేయండి. చక్కగా యాసిడ్‌ లాగా పనిచేసి ఆ ప్లేట్‌ను శుభ్రం చేసేస్తుంది. టాయ్‌లెట్‌ క్లీనర్స్‌తో సమానమైన కూల్‌డ్రింక్స్‌ను మనం తాగవచ్చా? మన పిల్లల చేత తాగించవచ్చా? ఆలోచించండి. 

ఎన్నెన్నో రసాయనాలు... 
కూల్‌డ్రింక్‌లో అంత యాసిడ్‌ ఎందుకుంటుందని మీకు అనుమానం రావచ్చు. ఆ కూల్‌డ్రింక్స్‌లో కలిపే రసాయనాలు చూస్తే మీకే తెలుస్తుంది. వీటిలో ముఖ్యంగా ఫాస్పారిక్‌ యాసిడ్‌, కార్బొలిక్‌ యాసిడ్‌, ఎరిథార్చిక్‌ యాసిడ్‌, బెంజాయిక్‌ యాసిడ్‌ అనేవి కలుపుతారు. ఇన్ని రకాల యాసిడ్‌లు కలిస్తే గాని మనకు మజా రావడం లేదు. అందుచేతే కూల్‌డ్రింక్‌ తాగినపుడు గొంతులో, కడుపులో మంట, త్రేన్పులు, కపాలంలో, తలనరాలల్లో విపరీతమైన బాధ, ఎసిడిటీ వస్తుంటాయి. మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి. కానీ నోటిలోని పళ్లు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతిపెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసి పోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇంత గట్టిగా మన పళ్లు తయారు చేయబడ్డాయి. ఏ పళ్లనైతే అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లనైతే మట్టి తనలో కరిగించుకోలేక పోయిందో, అవే పళ్లను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్లు రంగుమారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌డ్రింకులో ఒక పన్ను వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. ఇది నేను స్వయంగా పరిశీలించిన విషయం. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపులో 50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్‌డ్రింక్‌ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విషపదార్ధాలా? విషపదార్థాలే, కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషంలా పనిచేస్తాయి. అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్‌కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి. 

నిల్వ ఉంచేందుకు విషవాయువు కలిపి... 
ఈ భూమిపై నివసించే ప్రతి ప్రాణితో పాటు మనం కూడా ప్రాణవాయువును లోపలకు పీల్చుకొని, కార్బన్‌డైఆక్సైడ్‌ను విడిచిపెడుతూ ఉంటాం. ఈ కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే విషవాయువును కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచటం కోసం కలుపుతారు. అందుచేతనే మనం ఏ రకమైన కూల్‌డ్రింక్‌ తాగినా, తాగిన వెంటనే నోటిలో నుంచి, ముక్కులో నుంచి ఆ చెడ్డవాయువు బయటకు వస్తుంది. ఒక కాలేజీలో ఇద్దరు కుర్రాళ్లు పోటీ పెట్టుకొని ఒకరు 8, మరొకరు 9 కూల్‌డ్రింక్స్‌ను అతి కష్టంగా తాగారు. డాక్టరు వచ్చేలోపే ఇద్దరూ చనిపోయారు. శవపరీక్షలో చూస్తే వారిద్దరి శరీరంలో కార్బన్‌డైఆక్సైడ్‌ అనే విష వాయువు ఎక్కువై పోయి మరణించారని తెలిసింది. ఈ సంఘటన ముంబయిలో జరిగింది.
 
కూల్‌డ్రింక్స్‌లో విషపూరిత రసాయనాలు అయిన ఆక్సనిక్‌, కాడ్మియం, జింక్‌, సోడియం, గ్లూటమేట్‌, పొటాషియం సార్బేట్‌, మిథాయిల్‌ బెంజీన్‌, బ్రోమినేటెడ్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ కలుపుతున్నట్లు వెల్లడైంది. ఇన్ని విషాలు కలిసినవి కాబట్టే 6 సంవత్సరాల లోపు పిల్లలు తాగరాదని సీసాలపై హెచ్చరిక రాసుంటుంది. మన దేశంలో ఇలా రాయటం లేదు. 

మనం తాగే కూల్‌డ్రింక్‌ సీసాలు కూడా లెట్రిన్‌ క్లీన్‌ చేసే యాసిడ్‌తో సమానంగా ఆమ్లగుణాన్ని కలిగి ఉన్నాయి. మీరు ఓసారి లెట్రిన్‌ బాగా మరకలు పడి ఎండిపోయినపుడు దానిపై యాసిడ్‌ పోయకుండా కూల్‌డ్రింకు పోసి అయిదు నిమిషాలు ఆగి శుభ్రం చేయండి. చక్కగా యాసిడ్‌ లాగా పనిచేసి ఆ ప్లేట్‌ను శుభ్రం చేసేస్తుంది. టాయ్‌లెట్‌ క్లీనర్స్‌తో సమానమైన కూల్‌డ్రింక్స్‌ను మనం తాగవచ్చా? మన పిల్లల చేత తాగించవచ్చా? 


ఆరోగ్యానికి సంబంధించి  డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజు ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకూ 0863-2333388కు కాల్‌ చేయవచ్చు.