బి.పి.హెచ్‌తో జాగ్రత్త!

08-07-2019: ఎంతసేపూ, గుండె, కిడ్నీలు, లివర్ల ప్రాధాన్యతల గురించే మాట్లాడతాం... కానీ, ప్రొస్ట్రేట్‌ గ్రంధి కూడా అంతే కీలకమైనది. పురుషుల్లో మాత్రమే ఉండే ఈ గ్రంధి యుక్త వయసు వచ్చేనాటికి గోల్ఫ్‌ బాల్‌ సైజుకు పెరిగి ఆగిపోతుంది. అయితే వివిధ కారణాల వల్ల 50 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఈ గ్రంధి మరోసారి పెరగడం ఆరంభిస్తుందిక. నిజానికి, ఈ పెరుగుదల వాంఛనీయమేమీ కాదు. ఎందుకంటే అలా పెరగడం వెనుక వ్యాధికారక కారణాలు ఉంటాయి. వాటిల్లో ప్రొస్ట్రేట్‌ గ్రంధి అసహజంగా పెరగడం బి.పి.హెచ్‌ (బినైన్‌ ప్రోస్టేట్‌ హైపర్‌ట్రోఫీ) కావచ్చు. గ్రంధిలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రొస్టేటెటిస్‌ కావచ్చు. ఒక్కోసారి ప్రొస్టేట్‌ కేన్సర్‌ కావచ్చు.
 
50 శాతం దాకా...
పురుషుల్లో 50 శాతం మంది తమ జీవితకాలంలో ఒకసారైనా గ్రంధి పెద్దదయ్యే ప్రొస్ట్రేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. 60 ఏళ్లు వచ్చేసరికి ప్రతి ఇద్దరిలో ఒక రు, 70 ఏళ్లు వచ్చేసరికి ప్రతి 10 మందిలో 9 మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనదేమీ కాదు. కాకపోతే కొందరి ప్రొస్టేట్‌ గ్రంధిలో కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.
 
ప్రొస్ర్టేట్‌ గ్రంధిలో వచ్చే ఈ తరహా సమస్యలకు ఇదీ అని చెప్పగలిగే ప్రత్యేక కారణమంటూ ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. కాకపోతే పెద్దవయసులో జరిగే హార్మోన్ల మార్పులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయుర్వేద దృక్సథంలో ఆ కారణాలు వేరు ముఖ్యంగా, శరీర శ్రమ లేకపోవడం, శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోకపోవడం, వివిధ కారణాల వల్ల మూత్రాన్ని విసర్జించకుండా ఎక్కువ సేపు ఆపడం వంటివి ఈ గ్రంధి ఆరోగ్మాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది.
ఆధునిక వైద్య విధానంలో ఈ తరహా సమస్యలు తలెత్తినప్పుడు సర్జరీ ద్వారా ఆ గ్రంధిని తొలగిస్తూ ఉంటారు. దీనివల్ల మూత్ర విసర్జనలో అంతరాయం ఏర్పడి అంతిమంగా అది కేన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధులు రావడానికి దారి తీయవచ్చు.
 
ఆయుర్వేద విశిష్టత...
ఆయుర్వేద మూలికా ఔషధాలు తీసుకుంటూ, ఆ శాస్త్రం సూచించే ఆహార విధానాలు పాటిస్తూ ఉంటే గ్రంధిని జీవితకాలమంతా ఆరోగ్యంగా కాపాడుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గ్రంధి సమస్యలు మధ్య వయసులోనే వస్తుంటాయి. అలాగని ఆ వయసు దాకా నిర్లిప్తంగా ఉండిపోవడం సరికాదు. అంత కన్నా ముందే ఆయుర్వేద ఔఽషధాలు తీసుకోవడం ద్వారా సమస్యను ముందే అరికట్టవచ్చు.
వ్యాధిని నిరోధించే అనేక చికిత్సలు ఉన్నాయి. వాటిల్లో టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ నిల్వలను సమతుల్యంగా ఉంచుతూ, ప్రాణ శక్తిని పెంచడం జరుగుతుంది. అదే సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ, ప్రొస్ట్రేట్‌ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచే వైద్య విధానాలు కొనసాగుతాయి.
 
గ్రంధి పెద్దదైతే కనిపించే లక్షణాలు
తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాలనిపించడం
మూత్రనాళంలో మంట, మూత్రం మధ్య మధ్యలో ఆగిపోయి ఆ తర్వాత మళ్లీ మొదలవడం.
మూత్రంలో రక్తం కనిపించడం
మూత్రం కొంచెం కొంచెంగా రావడం.
మూత్ర విసర్జన కోసం రాత్రి నిద్రా సమయంలో తరచూ మెలుకువ రావడం.
మూత్ర విసర్జన తర్వాత కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదనే భావన వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
 
డాక్టర్‌ డి. ప్రశాంత్‌ కుమార్
ఆయుర్వేద వైద్య నిపుణులు
శక్తి ఆయుర్వేద క్లినిక్‌
హైదరాబాద్‌