వీర్యశక్తిని పెంచే ఆయుర్వేదం మీ చెంత

ఆంధ్రజ్యోతి, 23-04-2013:సవాలక్ష సమస్యలు ఒంటినిండా ఉంచుకుని సంతానం కలగడం లేదని బాధపడితే ఎలా? వాత, పిత్త, కఫాల్లోని దోషాలు మీ సప్తధాతువులనూ దెబ్బ తీస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే శుక్రధాతువూ క్షీణిస్తుంది. అందుకు దారి తీసిన అసలు కారణాలను తీసివేయకుండా ఏవో కృత్రిమ విధానాలను ఆశ్రయిస్తే ఒరిగేదేమిటి? కేవలం 3 నుంచి 5 మాసాల్లోనే శుక్రకణాలను వృద్ధిచేసి సంతానానికి మార్గం సుగమం చేసే అవకాశాలు ఆయుర్వేదంలో సంపూర్ణంగా ఉన్నాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ బి బాలాజీ. 


ఎంత సౌభాగ్యం ఉంటే మాత్రం ఏమిటి?సంతానమే కలగకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్లేగా...? శృంగారంలో పాల్గొనడంలో ఏమీ అంతరాయం లేకపోవచ్చు. కానీ, శుక్రకణాల సంఖ్య, వాటి శక్తీ తగ్గిపోతే సంతానం ఎలా కలుగుతుంది. అలా అని కృత్రిమ విధానాలకు వెళ్లి లక్షలు ఖర్చు చేస్తే మాత్రం ఎంత మందికి అలా ప్రయోజనం కలుగుతుంది? అందుకే ఆయుర్వేదం పురుషుడ్ని సర్వశక్తివంతుడిగా మారుస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతమైన శిశువు కలగడానికి సంపూర్ణంగా తోడ్పడుతుంది.
 
సంతానలేమికి అసలు కారణాలు 
వీర్యంలో అంటే శుక్రకణాల్లో దోషాలు ఉండడం సంతానం కలగకపోవడానికి అతిపెద్ద కారణంగా ఉంటాయి. . ఈ శుక్రదోషాలను ఆయుర్వేదం ఎనిమిది రకాలుగా విభజించింది.
 
వాత దుష్టి 
వాటిలో వాత దుష్టి ఒకటి. శుక్రం దెబ్బ తినడానికి ప్రధానంగా ఎనిమిది కారణాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది వాతదోషం. దీన్నే వాతదుష్టి అనికూడా అంటారు. వాతం సమతుల్యత కోల్పోవడమే ఇక్కడ సమస్య. ఈ స్థితిలో వీర్యంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆలస్యంగా స్ఖలనం కావడం. స్ఖలనం అవుతున్న సమయంలో నొప్పి కలగడం ముఖ్యమైనవి. మామూలుగా అయితే వీర్యం సహజమైన ఒక వాసనతో ఉంటుంది. వాతదుష్టి ఉన్నవరిలో ఏ రకమైన వాసనా ఉండదు. పైగా వీర్యం తక్కువ పరిమాణంలో విడుదల అవుతుంది. సహజంగా వీర్యం చిక్కగా,ఉంటుంది. కానీ, వీరిలో వీర్యం బాగా పలుచగా ఉంటుంది. ఇవి శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉందని చెప్పే సూచనలు. ఈ కారణాలన్నీ సంతాన లేమికి కారణమవుతాయి.
 
పిత్తదుష్టి 
అలాగే పిత్త దుష్టికి లేదా పిత్తదోషానికి గురైనప్పుడు వీర్యం పసుపు రంగులో ఉంటుంది. స్ఖలనం అవుతున్నప్పుడు మంటగానూ, నొప్పిగానూ ఉంటుంది. వృషణాల్లో వాపు ఏర్పడటం వల్ల కొన్నిసార్లు ఈ సమస్య తలెత్తవచ్చు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లతో కూడా ఈ సమస్య రావచ్చు
 
కఫదోషం 
శరీరంలో కఫదోషం పెరిగిపోయినప్పుడు వీర్యం ఎక్కువ మొత్తంలో విడుదల అవుతుంది. భరించలేనంత దుర్వాసనగా ఉంటుంది. శృంగారంలో అతిగా పాల్గొనడం అంటే అది శుక్రధాతు క్షయం జరగడమే. సప్తధాతువుల్లో చివరిది శుక్రధాతువు కాబట్టి, శుక్రధాతువు క్షీణించడం అంటే మిగతా ఆరు ధాతువులూ దెబ్బ తిన్నాయనే అర్థం.శరీరంలో రక్తదుష్టి ఏర్పడినప్పుడు వాళ్ల వీర్యంలో రక్తకణాలు కనిపిస్తాయి. వీటితో పాటు గ్రంధీభూత అనే మరో సమస్య ఉంది. ఇందులో వాతం, కఫం రెండూ ప్రకోపితమవుతాయి. దీనివల్ల వీర్యం గడ్డలుగా తయారవుతుంది. ఫలితంగా శుక్రకణాలు స్త్రీ భీజంతో కలవలేక వారికి సంతానం కలగదు. పిత్తము, కఫమూ రెండింటి తీవ్రత పెరిగే ఈ స్థితిని పూతిపూయ అంటారు. ఈ స్థితిలో వీర్యంలో చీము కణాలు కనపడతాయి. ఆయుర్వేదంలో ఈ స్థితినే పూతిపూయ అంటారు. పిత్తం, వాతం తీవ్రత పెరగడం వల్ల ఏర్పడే స్థితిని క్షీణశుక్ర అంటారు ఈ స్థితిలో స్ఖలనం రావడానికి బాగా ఆలస్యమవుతుంది. వీర్యం తక్కువ పరిమాణంలో వస్తుంది. ఇలాంటి వారి వీర్యంలో స్వల్పంగా రక్తకణాలు కూడా కనిపిస్తాయి. ఇక చివరిది మూత్ర పురీష గంధ అనే సమస్య.ఈ స్థితిలో వీర్యం మలమూత్రాల వాసనవేస్తుంది.
 

ఆయుర్వేద విశిష్ఠత 
సంతానలేమికి కారణమైన అవరోధాలను తొలగించడానికి ముందుగా నిరూహవస్తి చేయవలసి ఉంటుంది. ఆ తరువాత పంచకర్మ చికిత్సలో భాగమైన ఉత్తర వస్తి చికిత్స చేస్తాం. . ఔషఽధ తైలాలను మల, మూత్ర నాళాల ద్వారా లోనికి పంపిన తదుపరి వాజీకరణ చికిత్సలు కూడా ఉంటాయి.
 
నిరూహ వస్తి తరువాత చేసే ఉత్తర వస్తి చికిత్స ద్వారా కేవలం 3 నుంచి 5 మాసాల లోపలే సంతానానికి అవసరమైన స్థాయిలో శుక్రకణాల వృద్ది జరుగుతుంది. అయితే ఉత్తర వస్తి అనేది ఒక చికిత్సా క్రియారూపమే కానీ, అందులో వినియోగించే ఔషధాలు వ్యక్తివ్యక్తికీ వేరుగా ఉంటాయి. వ్యక్తుల శరీర విలక్షణ తను, ప్రకృతిని అనుసరించి జరిగే ఈ వైద్య చికిత్సలు పరిపూర్ణమైన పురుషుడిగా నిలబెడతాయి. ఇన్నేళ్ల మీ దాంపత్య జీవితానికి సార్థకంగా మీకు సంతానప్రాప్తికి సంపూర్ణంగా సహకరిస్తాయి. 


డాక్టర్‌ బి.బాలాజీ 
ఆర్‌ కె ఆయుర్వేదిక్‌ అండ్‌ 
సొరియాసిస్‌ సెంటర్‌ 
క్లినిక్స్‌:  హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌, హన్మకొండ, కర్నూలు, తిరుపతి 
ఫోన్‌: 9849254587, 
040-23057483