నిగారింపు కోసం...!

30-5-2017: చర్మం కాంతిమంతంగా ఉండాలంటే రోజూ పాలు తీసుకోవాలి. పాలు తాగడం ఇష్టం లేకపోతే పాల ఉత్పత్తులను తీసుకున్నా స్కిన్‌ టోన్‌ మెరగవుతుంది. రాత్రివేళ చల్లటి పాలు తాగితే చర్మసౌందర్యం మెరుగవుతుంది.

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ డైట్‌ తప్పనిసరి. సోయా పాలు, ఎరుపు, పసుపు రంగు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు  ఎక్కువగా  తీసుకోవాలి. 

ఈ రోజుల్లో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. బయటకు వెళ్లి వచ్చిన తరువాత తప్పనిసరిగా నేచురల్‌ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 

వారమంతా బిజీగా ఉన్నా వీకెండ్‌లో తప్పనిసరిగా ఫేస్‌ప్యాక్‌ను అప్లై చేసుకోవాలి. ఇంట్లో లభించే పదార్థాలతో చేసుకున్న ఫేస్‌ప్యాక్‌ అయితే మరీ మంచిది.

స్కిన్‌ టోన్‌ పెరగాలంటే తేయాకులను మరిగించి ఆ నీరు చల్లారిన తరువాత ఒక స్పూన్‌ తేనె కలిపి ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖకాంతి పెరుగుతుంది.

రెండు, మూడు టేబుల్‌స్పూన్ల పచ్చిపాలు, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది. 

ఫేస్‌ప్యాక్‌లు, ఆహారంతో పాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అప్పుడే చర్మం ఆరోగ్యంగా, నిగారింపుతో ఉంటుంది.