అరటితో అందం

01-07-2017:రోజు ఒక అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాదు.. సౌదర్య సాధనానికి ఎంతో ఉపయోగం. అరచి పండులో మాయిశ్చర్‌ అధికం. పొటాషియం, విటమిన్‌ ఇ, సి వంటివి చర్మానికి మేలు చేస్తాయి. అరటిగుజ్జులోకి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, అర టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి.. ఫేస్‌మాస్క్‌ వేసుకోవాలి. వేళ్లతో ముఖానికి ఆ మిశ్రమాన్ని పట్టిస్తూ.. సున్నితంగా రుద్దాలి. గంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటిలోని విటమిన్‌ ఎ ముఖం మీదున్న నల్లమచ్చలను తొలగిస్తుంది. చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది.