చర్మంపై కురుపులు వస్తే..

17-06-2017:సాధారణంగా స్టాఫిలోకోక్కస్‌ అనే బ్యాక్టీరియా చర్మం మీద కురుపులు, పుండ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. ముందు ఎరుపు రంగులో కనిపించే ఈ కురుపులు ఆ తర్వాత చీము నిండి పుండుగా మారతాయి. ఈ దశలో విపరీతమైన నొప్పి, బాధ ఉంటాయి. ఈ సమస్యకు గృహ వైద్యంగా...

శొంఠి, ఇంగువను కలిపి, చూర్ణం చేసి, అందులో కొద్దిపాటి నీరు కలపాలి. అలా ఫేస్ట్‌గా తయారు చేసి, ఆ కురుపులు లేదా పుండ్లపైన రోజుకు రెండుసార్లు రాయాలి.

తులసి ఆకు రసంలో కాస్తంత పసుపు కలిపి... ఫేస్ట్‌ చేసి, పుండ్లమీద రుద్దాలి. ఈ ముద్దను కడుపులోకి కూడా తీసుకోవచ్చు. దీనివల్ల రక్తశుద్ధి కలిగి పుండ్లు తొందరగా నయం అవుతాయి.

లేత తమలపాకులను పెనం పైన వేసి మెత్తబడే దాకా వేడిచేయాలి. శుద్ధి చేసిన ఆముదం లేదా వండిన ఆముదాన్ని ఆ తమలపాకుల మీద రాసి పుళ్ల మీద పెట్టాలి.

ఆవాల చూర్ణంతో ఫేస్ట్‌ చేసి, పుండ్ల మీద లేపనంగా రాసినా మంచి ఫలితం ఉంటుంది.

పచ్చి నేల వామును సేకరించి, నూరి మాత్రలు తయారు చేసి, ఎండబెట్టి, గాజు సీసాలో భద్రపరుచుకుని ప్రతి రోజూ రెండు పూటలా... రెండేసి చొప్పున తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.

ఈ చిట్కాలు కురుపులు, పుండ్ల బాధ నుంచి చాలా తొందరగా ఉపశమనం కలిగిస్తాయి.