డీఎన్‌ఏ సన్‌స్ర్కీన్‌తో చర్మంపై రక్షణ పొర

26-07-2017: అతినీలలోహిత కిరణాలనుంచి చర్మాన్ని రక్షించే సరికొత్త సన్‌స్ర్కీన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అదేసమయంలో చర్మాన్ని పొడిబారకుండా(తేమ ఇంకిపోకుండా) ఈ సన్‌స్ర్కీన్‌ కాపాడుతుందట. దీనిని డీఎన్‌ఏతో తయారు చేయడం విశేషం! సాధారణంగా అతినీలలోహిత కిరణాలు చర్మంలోపలికి చొచ్చుకుపోయి డీఎన్‌ఏను దెబ్బతీస్తాయి. ఫలితంగా రకరకాల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని బింగ్‌హామ్టన్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గై జర్మన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో చర్మంపైన డీఎన్‌ఏ పొరను ఏర్పాటుచేసి, దాంతో లోపల ఉన్న డీఎన్‌ఏను రక్షించాలని పూర్తి పారదర్శకమైన డీఎన్‌ఏను తయారు చేశామని చెప్పారు.