సెల్ఫీతో ముడతలు

31-08-2017: సెల్ఫీ దిగడం అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్‌ అయిపోయింది. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా సెల్ఫీ దిగడం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు ముఖం మీద ముడతలకు కారణం అవుతుంది అంటున్నారు బ్రిటన్‌ నిపుణులు. సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే రేడియేషన్‌ కారణంగా చర్మం ముడతలు పడుతుందనీ, ఏ వైపు సెల్ఫీ తీసుకుంటున్నారో ఆ వైపు ముఖం మీద చర్మం ముడతలు పడుతుందనీ వారు హెచ్చరిస్తున్నారు. ఫోన్ల నుంచి వెలువడే నీలిరంగు కాంతి చర్మానికి హాని కలిగిస్తుందని వారు చెబుతున్నారు. అంతే కాకుండా ఫోను నుంచి వెలవడే ఎలక్ర్టో మాగ్నిటిక్‌ రేడిషయన్‌ కారణంగా డిఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం కూడా పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందువలన ఎంతో అవసరం అయితే తప్ప సెల్ఫీలు దిగకుండా ఉంటేనే మంచిదని వారు సూచిస్తున్నారు.