ఇది స్కిన్‌ వీర!

ఆంధ్రజ్యోతి, 18-09-2017: కీరదోసకాయ చర్మానికి తేమని అందించడంతో పాటు పోషణనిస్తుంది. ఇందులో ఆస్ర్టింజెంట్‌ ధర్మాలు కూడా ఉన్నాయి. చర్మంలో ఉండేంత పిహెచ్‌ ఇందులో కూడా ఉంది. దానివల్ల చర్మంపై సహజసిద్ధంగా ఏర్పడే ఆమ్ల పూత తగ్గిపోతే దాన్ని తిరిగి చర్మంపై చేర్చేందుకు సాయపడుతుంది. బ్యాక్టీరియాతో పాటు ఇతర హానికారక పదార్థాలను చర్మంపై చేరనీయకుండా చేస్తుంది.

 ప్రతి రోజూ కీరదోసకాయ ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌, ముడతలు, పొడి చర్మం వంటి సమస్యలు మీ దరిచేరవు. రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మీల్‌, సగం ముక్క కీరదోసకాయ గుజ్జు, కొంచెం పాలు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.