చర్మ కణాలు.. చాలక నాడులుగా...

12-09-2017: మూల కణ స్థితి అవసరం లేకుండానే శాస్త్రవేత్తలు మనిషి చర్మ కణాలను చాలక నాడులుగా రూపాంతరం చెందించారు. దీని సాయంతో మానవుని కేంద్ర నాడీ వ్యవస్థను ల్యాబ్‌లో అధ్యయనం చేయనున్నారు. ఈ విధానాన్ని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికోసం ఆరోగ్యవంతులైన యువతీయువకుల చర్మకణాలను ఉపయోగించినట్లు తెలిపారు. బతికి ఉన్న మనిషి నుంచి చాలక నాడులను సేకరించడం సాధ్యం కానందున, చర్మ కణాలను చాలక నాడులుగా మార్చి పరిశోధనలు చేయనున్నట్లు వెల్లడించారు.