మెరిసే చర్మం కోసం...

14-08-2017: కాలుష్యం కారణంగా చర్మంపై మృతకణాలు, టానింగ్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని పోగొట్టుకునేందుకు క్రమం తప్పకుండా ఎక్స్‌ఫొలియేషన్‌ చేసుకోవాలి. మీ చర్మ స్వభావానికి సరిపడే స్క్రబ్‌ను అప్లై చేసుకోవాలి.

ఫేస్‌ మాస్కు కూడా తరచూ వేసుకోవడం వల్ల చర్మం మరింత కాంతులీనుతుంది. చర్మం లోపలికి దుమ్ము, ధూళి పోకుండా మాస్కు అడ్డుకుంటుంది.
చర్మ స్వభావానికి తగ్గట్టు నాణ్యమైన నైట్‌క్రీమును వాడాలి. క్రీమును చర్మానికి రాసుకునే ముందు అందులో ఎలాంటి హానికర కెమికల్స్‌ లేకుండా చూసుకోవాలి.