ఆంధ్రజ్యోతి(23-10-2016): చర్మాన్నీ, గోళ్లను, శ్లేష్మపు పొరతో ఉండే కొన్ని భాగాలను దీర్ఘకాలికంగా శోధానికి గురిచేసేదే లైకెన్ ప్లానస్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 3 శాతం దాకా ఉంటోంది. అన్ని వయసుల వారికీ సోకే ఈ వ్యాధి 40 ఏళ్లు పైబడిన వారిలో కాస్త ఎక్కువగా కనిపిస్తంది. సీ్త్ర పురుషుల్లో దీని ప్రభావం సమాన స్థాయిలోనే ఉంటుంది. కాకపోతే నోటిలో ఏర్పడే ఓరల్ లైకెన్ ప్లానస్ మాత్రం సీ్త్రలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధిలో చర్మంపైన లేత ఎరుపు- నీల వర్ణాలు కలిసిన చిన్న గడ్డలు కనిపిస్తాయి. అయితే ఇది ఒకరినుంచి మరొకరికి పాకే అంటువ్యాధి మాత్రం కాదు. శ రీరంలోని ఏ భాగంలోనైనా ఈ వ్యాధి ఏర్పడవచ్చు. అయితే శరీరంలో ఇది ఏర్పడే ప్రాంతం దాని తీరును బట్టి ఈ వ్యాధిని కొన్ని తరగతులుగా విభజించడం జరిగింది.
వ్యాధి ఏర్పడే ప్రదేశాలు
క్యుటేనియస్: చర్మం, తలపై చర్మం, గోళ్లు ఈ వ్యాధితో ప్రభావితమవుతాయి.
మ్యూకోసల్ : దీనితో ఆహార నాళం, నోరు, పారింక్స్, ఈసోఫేగల్, లారింక్స్లతో పాటు సీ్త్ర పురుషుల జననాంగ ప్రదే శాలు కూడా ఈ వ్యాధితో ప్రభావితమవుతాయి.లైకెన్ ప్లానె్సలోని ఇతర రకాల్లో యాన్యులార్, లీనియర్, హైపర్ ట్రోపిక్, బుల్లస్, అల్సరేటివ్ లేదా ఇరోసివ్, సిగ్మెంటెడ్ కూడా ఉన్నాయి.
వ్యాధికారకాలు
నిజానికి ఈ వ్యాధి రావడానికి గల కఛ్చితమైన కారణాలంటూ ఇంత వరకు తెలియరాలేదు. కాకపోతే కొన్ని అసమతుల్యతల వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పొరబడి సొంత కణాల మీదే దాడిచేయడం ఇందుకు ఒక కారణమని కొన్ని అనుభవాల వల్ల తెలుస్తోంది. అయితే వ్యాధిని ప్రేరకాలు తరుచూ ఎదురైనప్పుడు ఈ లక్షణాలు చాలా స్పష్టంగా బయటపడతాయి.
ప్రేరేపితాల్లో.....
కొన్ని రకాల మందులు ముఖ్యంగా డైయూరిటెక్స్, అధిక రక్తపోటు, గుండెజబ్బుల నివారణకై వాడే మందులు, హెపటైటిస్ - సి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల రసాయనాలు, కొన్ని రకాల అలర్జీ కారక పదార్థాలు అంటే, యాంటీబయాటిక్స్, ఆర్సెనిక్, గోల్డ్, అయోడైడ్ కాంపౌండ్స్, కొన్ని రకాల ‘డై’లు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి కలుగుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు కూడా ఈ వ్యాధిని ప్రేరేపించే అవకాశం ఉంది.
వ్యాధి లక్షణాలు
శరీరంలో లైకెన్ ప్లానెస్ ఏర్పడిన ప్రాంతాన్ని బట్టి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం మీద అయితే లేత ఎరుపు వర్ణపు దృఢమైన గడ్డలు మెరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఈ గడ్డలు కొందరిలో తక్కువ సంఖ్యలో మరికొందరిలో ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. ఈ గడ్డలు చర్మం మీద అంటే మణికట్టు, నడుము, చీలమండలు, సీ్త్ర, పురుషుల జననాంగ భాగాల్లో ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఈ గడ్డలు దీర్ఘకాలికంగా కొనసాగిన వారిలో చర్మం మీద దళసరి బిల్లలు ఏర్పడతాయి.
అరుదుగా కొందరిలో దురద, నొప్పి, నీటి పొక్కుల వంటివి కనిపిస్తాయి. నోటిలో అయితే, బుగ్గలలోపల, నాలుక, పెదాలు, చిగుళ్ల పైన ఎక్కడైనా ఏర్పడవచ్చు. తెలుపు రంగులో ఉండే చిన్న పొక్కులు కొందరిలో ఒక తాడులా కనిపిస్తాయి. ఎర్రని వాపుతో కూడా ఉంటాయి.
చిగుళ్ల మీదున్న చర్మం ఊడిపోవడం, బాగా నొప్పిగా ఉండే పుండ్లు ఏర్పడటం ఉంటుంది.
గోళ్లు ఈ వ్యాధి బారిన పడితే, గోళ్లు మొదట పలచబడి, ఆపైన చారలు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు గోళ్లు, తాత్కాలికంగానో, శాశ్వతంగానో కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
చాలా అరుదుగా కొందరిలో తల చర్మం మీద కూడా కనిపిస్తుంది. దీనివల్ల ఆ భాగంలో దురద కలిగించే ఎర్రని చిన్న గడ్డలు కనిపిస్తాయి. దీనికి తోడు వెంట్రుకలు ఊడిపోవడం లేదా వెంట్రుకలు ప్యాచ్లుగా కూడా ఊడిపోవడం, ఆ తర్వాత ఆయా భాగాల్లో మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
వ్యాథి నిర్ధారణా పరీక్షలు
ఈ వ్యాధి తాలూకు వివిధ లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. కొన్నిసార్లు చర్మం మీది మచ్చలు, నోటిలో ఏర్పడే పుండును బయాప్సీచేయడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. హెపటైటి్సను గుర్తించేందుకు రక్తపరీక్ష కూడా అవసరమవుతుంది.
హోమియో వైద్యం
ఏ రకం ఆటో ఇమ్యూన్ వ్యాధులనైనా హోమియో వైద్యం ద్వారా నయం చేయవచ్చు. అత్యంత అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానంలో రోగి శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా సమగ్రమైన అధ్యయనం చేసి సరిపడే ఔషధాలను ఇవ్వడం జరుగుతుంది. వీటివల్ల శరీరంలోని అసమతుల్యతలన్నీ తొలగిపోయి వ్యాధినిరోధక శక్తి పుంజుకోవడంతో పాటు ఈ వ్యాధి మరోసారి వచ్చే అవకాశమే లేకుండా వ్యాధి సమూలంగా తొలగిపోతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్
హోమియోకేర్ ఇంటర్నేషనల్ టోల్ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తమిళనాడు