స్పర్శతో గాయం మాయం

9-8-2017: దెబ్బ తగిలి గాయమైతే.. అది తగ్గడానికి మందులు వాడాలి. అదే సినిమాల్లో చూపించేలా గాయాల్ని మాన్పించే మంత్రదండం లాంటిది ఉంటే ఎంత బాగుండునో కదా! అలాంటి ఒక పరికరాన్ని అమెరికాలోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. కేవలం దాన్ని స్పర్శిస్తే చాలు గాయాలు నయమవుతాయట. ఈ పరికరం శరీరంలోని చర్మ కణాల్ని ఏదైనా మరో రకమైన కణంలా మార్చేస్తుందట. టిష్యూ నానోట్రాన్స్‌ఫెక్షన్‌(టీఎన్‌టీ) టెక్నాలజీతో కణజాలాన్ని, రక్తనాళాల్ని, నరాల్ని బాగుచేస్తుందట. మొదటి వారంలో కణజాలం బాగుచేస్తుందని, రెండో వారంలో గాయాన్ని పూర్తిగా మానేలా చేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.