అటోపిక్‌ డెర్మటైటిస్‌కు దీటైన వైద్యం- హోమియో

13-09-2017: మానవ శరీరంలోకెల్లా చర్మం అతి పెద్ద అవయవం. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది తమ జీవితకాలంలో ఏదో ఒక చర్మ సమస్యతో బాదపడుతున్నారనేది వాస్తవం. ఎగ్జిమా అన్నది చర్మానికి శోథనాన్ని కలిగించే కొన్ని రకాల చర్మ వ్యాధుల సమూహనామం. ఈ శోథనం వల్ల చర్మం ఎర్రగా మారడం, దురద పెట్టడం, వాపుతో పాటు పొక్కులు ఏర్పడటం, ఆ తర్వాత ఈ పొక్కులు నీటి బుడగలా మారి చితికి రసి కారడం ఉంటాయి.
 
ఆ పైన ఆయా భాగాల్లో మచ్చలు ఏర్పడుతుంటాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఈ లక్షణాలు ఎగ్జిమా బాధితుల్లో కనిపిస్తాయి. పలురకాల ఎగ్జిమాలు ఉన్నప్పటికీ ‘ఆటోపిక్‌ డెర్మటైటిస్‌’ అనే ఎగ్జిమా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. మామూలుగా అన్ని వయస్సులవారిలోనూ కనిపించే ఈ సమస్యకు శిశువుల్లో 65 శాతం మంది, చిన్న పిల్లల్లో 85 శాతం మంది లోనవుతుంటారు. కొందరిలో పిన్న వయసుకే పరిమితమయ్యే ఈ సమస్య, మరికొందరిలో జీవితకాలమంతా కొనసాగుతుంది.
 
అటోపిక్‌ డెర్మటైటిస్‌కు కారణాలు: నిజానికి, ఎగ్జిమా ఏర్పడటానికి గల కారణాలేమిటో ఇంత వరకూ స్పష్టంగా ఏమీ తెలియలేదు. కాకపోతే వంశపారంపర్యత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వంటివి ఈ సమస్యకు దారి తీయవచ్చని తెలుస్తోంది. ఎగ్జిమాను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థలో సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరగడం వల్ల ఎగ్జిమా మొదలవుతుంది.
 
ప్రేరకాలు: సాధారణంగా పొడి చర్మం కలిగిన వారిలో ఎగ్జిమా ఎక్కువగా కనపిస్తుంది. ఎగ్జిమా కారకమైన పదార్థాల్లో కొన్ని..
దుమ్ము, ధూలి, జంతు కేశాలు, పుప్పొడి రేణువులు
సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, బ్యాక్టీరియా, వైర్‌సలు
అధిక లేదా అల్ప ఉష్ణోగ్రత, అతిగా చెమట పట్టడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు (ఉదా: గుడ్లు, పాల ఉత్పత్తులు, సోయా లాంటి కొన్ని ధాన్యాలు)
సౌందర్య వృద్ధికి ఉపయోగించే సామగ్రి
చేతి గడియారాలు, కొన్ని ఆభరణాలు, డైపర్లు, డియోడరెంట్లు, ఉన్ని వస్ర్తాలు, దురదను కలిగించే కొన్ని ఇతర వస్తువులు.
మానసిక ఒత్తిడితో పాటు హార్మోన్‌ సమస్యల వంటి అంశాలన్నీ ఎగ్జిమాను ప్రేరేపిస్తాయి.


ఇవీ లక్షణాలు: ఎగ్జిమా లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. అయితే.. కొన్నిసార్లు ఈ లక్షణాలు పెరుగుతూ మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి.

ఎగ్జిమాలో కనిపించే ప్రధాన లక్షణం దురద. ఆ తర్వాత చర్మం ఎర్రగా మారి, వాపుతో పాటు పొక్కులు ఏర్పడతాయి. క్రమేణా ఇవి నీటి బుడగల్లా మారి, వాటినుంచి రసి కారడం, కొంత కాలానికి చర్మం దళసరిగానూ, నల్లగానూ మారే లక్షణాలు కనిపిస్తాయి.
ఎగ్జిమా చర్మం మీద ఎక్కడైనా కనిపించవచ్చు కాకపోతే. ఈ వ్యాధి లక్షణాలు ముఖం పైన, తలలో మోకాలు వెనుక భాగంలో, కాలి మడతలు, పాదాలపైన ఎక్కువగా కని
పిస్తాయి.
శిశువుల్లో అయితే మొదట్లో బుగ్గలపై దద్దుర్లుగా ఏర్పడి, కొన్ని నెలలకు ఈ దద్దుర్లు చేతులు కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయి.
ఎగ్జిమా బారిన పడిన చిన్న పిల్లలు హై ఫీవర్‌, లేదా ఆస్తమా సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణా పరీక్షలు : వ్యాధి లక్షణాలతో పాటు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, వారి వ్యక్తిగత ఆరోగ్యచరిత్ర ఆధారంగా ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రక్తపరీక్ష, చర్మపు మచ్చలను బయాప్సీ చేయడం ద్వారా కూడా ఎగ్జిమా వ్యాధిని నిర్ధారించవచ్చు.
 
హోమియో వైద్యం: కాన్స్‌టిట్యూషనల్‌ హోమియో చికిత్సలో భాగంగా, సూక్ష్మీకరణ పద్ధతిలో తయారైన హోమియో మందులతో ఎలాంటి సమస్యలనైనా పూర్తిగా తగ్గించడం సాధ్యమవుతుంది. వీటి ద్వారా శరీర రోగ నిరోధక కణాలకు పునరుజ్జీవం కల్పించి, ఎలాంటి దుష్ప్రభావాలూ లేకుండా ఎగ్జిమాను పూర్తిగా నయం చేస్తారు. ఈ విశిష్టమైన వైద్యరీతిలో రోగి మానసిక, వ్యక్తిగత లక్షణాలు, శరీర నిర్మాణం వంటి అంశాల పరిశీలన తదుపరి మాత్రమే అందించే ఈ చికిత్స ద్వారా ఈ వ్యాధినుంచి సంపూర్ణంగా విముక్తి పొందవచ్చు.
 
 
 
 
                                                                                                                                                           డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌
                                                                                                                                                           హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
                                                                                                                                                           టోల్‌ ఫ్రీ : 1800 108 1212
                                                                                                                                                           ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
                                                                                                                                                           తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి