ఈజీగా.. తాజాగా...

25-5-2017: అందంగా కనిపించడానికి అమ్మాయిలు ఎంతో ఇష్టపడతారు. అందుకోసం ఎంత సమయాన్నైనా వెచ్చిస్తారు. కానీ కొందరమ్మాయిలు సులభమైన బ్యూటీ టిప్స్‌తో మేకప్‌ వేగంగా పూర్తి చేయాలనుకుంటారు. ఈ తరహా అమ్మాయిల కోసం సులభమైన కొన్ని బ్యూటీ  టిప్స్‌....

లిప్‌స్టిక్‌ వేసుకోవడానికి ముందు పెదాలపై కొద్దిగా ఫౌండేషన్‌ అద్దుకుంటే పెదాలపై వేసుకున్న లిప్‌స్టిక్‌ రంగు రోజంతా తాజాగా ఉంటుంది.
వ్యాయామం అనంతరం ముఖం ఎర్రగా కందిపోతే ఆ ప్రాంతంలో రెండు నిమిషాల సేపు ఐస్‌ కోల్డ్‌ టవల్‌ ఉంచాలి. ఇలా చేయడం వల్ల కందిపోయిన ముఖంలోని ఎరుపుదనం తగ్గుతుంది.
బయటకు వెళ్లేటప్పుడు బేబీ ఆయుల్‌ని కొద్దిగా జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు మెరుస్తాయి. 
ఐలైనర్‌ను 10-15 నిమిషాలు ఫ్రీజర్‌లో ఉంచితే దాన్ని వాడేటప్పుడు తొందరగా విరగదు.
రాత్రి నిద్రపోవడానికి ముందు మొటిమ మీద కొద్దిగా టూత్‌పేస్టును అద్దితే మొటిమకున్న ఎర్రదనం, వాపు తగ్గుతాయి.
భుజాల భాగంలో షేవింగ్‌ చేసుకున్న తర్వాత మండుతుంటే దాన్ని చల్లబర్చడం కోసం స్నానం చేసిన తర్వాత డియొడెరంట్‌ను ఆ ప్రాంతంలో చల్లుకోవచ్చు.