నవ్వితే బరువు తగ్గుతారట!

16-05-2018: గతంలో నవ్వు నాలుగువిధాల చేటు అనేవారు. ఇప్పుడు అదేనవ్వు నాలుగు విధాల మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ పది నుంచి 20 నిమిషాల పాటు పెద్దగా నవ్వడం వలన 20కాలరీలు కరుగుతాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండా నవ్వు తెప్పించే సినిమాలు, సీరియల్స్‌, చూడడం, పుస్తకాలు చదవడం వలన మరిన్ని ఎక్కువ కాలరీలు కరుగుతాయంటున్నారు. రోజూ కొద్దిసేపు మనస్ఫూర్తిగా నవ్వడం వలన రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన వంటివి దరిచేరవని వారు చెబుతున్నారు. ప్రతిరోజూ ఎంతోకొంత సేపు నవ్వేవారికి ప్రాణాంతక వ్యాధులేవీ దరిచేరవట!