మగ పిల్లలకు ఇలా నేర్పండి!

ఆంధ్రజ్యోతి, 20-03-2018: పిల్లలకు తల్లే తొలి గురువు. పెంపకంలోనే తల్లి వాళ్లకెన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది. అయితే ప్రత్యేకించి మగ పిల్లల విషయంలో వాళ్లకు కొన్ని కీలకమైన విషయాలు చెప్పాలి. అవేంటంటే..

ఆటలాడు. అవి హూందాగా గెలవడం ఎలాగో నేర్పిస్తాయి, గౌరవంగా ఓడిపోవటమూ నేర్పిస్తాయి.
లైంగిక అనుబంధాలకు విలువివ్వు. నువ్వు తిరిగి ఇవ్వలేని దాన్ని ఆమె నుంచి తీసుకోకు.
యవ్వనంలో ఉన్నప్పుడే డబ్బు పొదుపు చేయు. అది మున్ముందు నీ అవసరాలకు ఉపయోగపడుతుంది.
ఓవెన్‌, స్టవ్‌, వాషింగ్‌ మిషన్‌, మాప్‌, చీపురు.... వీటి వాడకాన్ని నీకు నేర్పనీ! తర్వాత నువ్వు ఆ పనులు చేసి చూపించు.
ఎగతాళి చేయటం, విమర్శించటం చేయకు. ఎవరైనా నీతో అలా ప్రవర్తిస్తే వాళ్లను ఎదిరించు.
విద్య, విజ్ఞానాలను నీ నుంచి ఎవరూ తీసుకోలేరు.
మహిళలను గౌరవించు. వారి నిస్సహాయతను, బలహీనతలను నీ అవసరాలుగా మలుచుకోకు.
దృఢంగా ఉండు! అంతే సున్నితంగానూ కూడా ఉండు!