బరువులెత్తితే మతిమరుపు దూరం

14-7-2017:బరువులెత్తే వ్యాయామాలు చేస్తే శరీర ఆరోగ్యంతో పాటు మతిమరుపు కూడా దూరం అవుతుంది అంటున్నారు ఫిన్‌ల్యాండ్‌ పరిశోధకులు. ముఖ్యంగా బల్లపరుపుగా ఉండే బల్ల మీద పడుకొని బరువులెత్తుతూ వ్యాయామాలు చేసే వారు వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు నుంచి చాలా వరకూ తప్పించుకోవచ్చని వీరి అధ్యయనంలో వెల్లడైంది. సుమారు రెండు వందల మంది మీద వీరు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. వీరిలో ప్రతిరోజూ బరువులెత్తుతూ వ్యాయామాలు చేసేవారు. మరికొందరు మామూలు వ్యాయామం చేసేవారు. వీరందరూ వృద్దాప్యంలోకి ప్రవేశించిన తరువాత వీరి జ్ఞాపకశక్తిని పరిశీలించారు. బరువులెత్తుతూ వ్యాయామం చేసిన వారిలో మతిమరుపు లక్షణాలు బాగా తగ్గగా, మామూలు వ్యాయామం చేసిన వారిలో అలాంటి ఫలితం ఏదీ కనిపించలేదు.