సంతానోత్పత్తిని తగ్గించే పని ఒత్తిడి

28-11-2018: పని ఒత్తిడి మహిళల్లో గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుందన్న విషయం ఇటీవలి  అధ్యయనంలో తేలింది. పిల్లలు కావాలనుకునే మహిళలు ఖచ్చితంగా వర్క్-లైఫ్‌పై దృష్టిపెట్టాలని అధ్యయనకారులంటున్నారు..  ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు తీరికలేకుండా పనులు చేస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు. సంతానోత్పత్తి సమస్యలకు పనిఒత్తిడే కారణమని, దానివల్ల మహిళల్లో గర్భధారణ అవకాశాలు 25 శాతం తగ్గుతాయని అధ్యయనంలో స్పష్టమైంది. సంతానం కోరుకునే మహిళలకు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని త్వరగా సంతానం కావాలనుకునే మహిళలు ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిదని అధ్యయనకారులు సూచిస్తున్నారు.