ఇలా చేస్తే లావు తగ్గొచ్చు

ఆంధ్రజ్యోతి, 20-12-2016: కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం ఆరునెలలపాటు తింటే శరీరానికి మంచిదట. అంతేకాదు తక్కువ ఫ్యాట్‌ ఉన్న ఫుడ్‌ కన్నా లో-కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినడం వల్ల బరువు బాగా తగ్గుతారట. అంటే దాదాపు ఒక కిలో నుంచి నాలుగు కిలోల వరకు బరువు తగ్గుతారట. శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. దీన్నిబట్టి పరిమితకాలం తక్కువ కార్బోహ్రైడేట్స్‌ ఉండే ఫుడ్‌ తినడం మంచిది. వీటివల్ల శరీర బరువు కూడా తగ్గుతారు. అయితే లో-ఫ్యాట్స్‌ డైట్స్‌తో పోలిస్తే ఇందులో తగ్గే బరువు క్లినికల్‌గా సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ మంచివి కావు కాబట్టి ప్రతిఒక్కరూ వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.

 
కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం మూలంగా, ఎక్కువ మాంసాన్ని తినే అవకాశం ఉడడం వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం కలుగుతుంది. అంతేకాదు కేన్సర్‌ వంటి జబ్బులు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. బరువు అంటే కండలు తగ్గడమా, కొవ్వు తగ్గడమా, నీరా.... లాంటి విషయాలు కూడా ఈ స్టడీలో లేవనెత్తారు. అంతేకాదు ఎల్‌సిడి (లో-కార్బ్‌ డైట్స్‌) అర్థం వైవిధ్యంగా ఉంటుందన్నారు. కార్బోహైడ్రేట్స్‌ పరిమితంగా తీసుకున్నప్పటికీ తిన్న డైట్‌లోని కార్బోహైడ్రేట్లు నాలుగు శాతం నుంచి 46 శాతం వరకూ కాలరీలు కలిగి ఉంటాయిట. మొత్తానికి ఈ స్టడీలో శాస్త్రవేత్తలు ఎల్‌సిడి వల్ల తలెత్తే సమస్యలతోపాటు ప్రయోజనాలపై కూడా దృష్టిసారించారు. లో-ఫ్యాట్‌ ఫుడ్స్‌ వల్ల ఉండే ఇబ్బందులను తెలిపారు.