నడక ఆయిష్షును పెంచుతుంది

16-11-2017: రోజూ వ్యాయామం చేసేవారు, వారి నడక పెంచేకొద్దీ వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని యూనివర్సిటీ ఆప్‌ పిట్స్‌బర్గ్‌ పరిశోధకులు వెళ్లడించారు. వీరి అధ్యయనంలో భాగంగా 65 అంతకన్నా వయసు పైబడిన 34వేల మందిపై పరిశోధన జరిపారు. 75 నుంచి 84 సంవత్సరాల మధ్య వయసులో ఉంటూ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిచే వారిలో 92 శాతం మంది మరో పది సంవత్సరాలు అదనంగా బతికారట. అదే గంటకు 1.5 కిలోమీటర్లు నడిచేవారిలో కేవలం 30 శాతం మాత్రమే ఎక్కువ వయసు వరకు జీవిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. నడక వేగం ఏటా నిమిషానికి 5 మీటర్లు పెరిగితే జీవితకాలం 12 శాతం పెరుగుతున్నట్లు వీరు గుర్తించారు. వేగంగా నడవటం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు చురుకైన పనితీరు కలిగి ఉండటం కారణంగా జీవితకాలం పెరుగుతుందట. ముఖ్యంగా 65 పై బడినవారు తరచూ తమ నడక వేగాన్ని పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.