అతిగా వాడితే అనర్ధాలే

17-01-2018: ఏదైనా సరే అతి నష్టాన్నే కలిగిస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి ఉపయోగించే మౌత్‌వాష్‌ల ద్వారా నోట్లో ఫంగస్‌ ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా మౌత్‌వాష్‌లు వాడడం వలన వాటిలోని రసాయనాలు నోటికి హాని చేస్తాయనీ, ప్రమాదకరమైన నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇదే విషయం మీద వీరు కొంత మంది మీద దీర్ఘకాలం అధ్యయన నిర్వహించారు. కొంత మందికి కొన్ని రోజుల పాటు రసాయనాలు కలిగి ఉన్న మౌత్‌వాష్‌ను ఇచ్చారు. మరికొంత మందికి సాధారణ నీరు ఇచ్చారు. మౌత్‌వాష్‌లు వాడిన వారిలో నోరు చిగుళ్లు, దంతాలు పాడయి, అది శరీరం అంతా వ్యాపించే ప్రమాదాన్ని వారు గుర్తించారు. సాధారణ నీరు ఉపయోగించిన వారిలో ఈ మార్పును వారు గమనించలేదు. ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మౌత్‌వాష్‌ ఇవ్వకూడదని వారు సూచిస్తున్నారు.