గ్రౌండింగ్‌తో నొప్పులు మాయం!

29-08-2018: గ్రౌండింగ్‌ (Grounding ) అంటే చెప్పులు లేకుండా నడవడం అని అర్థం. ఇలా వారం రోజులపాటు నేల మీద నడిచినట్టయితే కాళ్ళు, కీళ్ళ నొప్పులు, వాపులు మాయం అవుతాయన్న విషయం ఇటీవలి ఓ పరిశోధనలో వెల్లడైంది. భూమిలో లెక్కలేనన్ని ఎలక్ర్టాన్స్‌, యాంటిఆక్సిడెంట్లు ఉంటాయనీ, చెప్పులు లేకుండా నేల మీద నడవడం వలన ఇవన్నీ నేరుగా మన శరీరంలో వచ్చి చేరతాయంటున్నారు పరిశోధకులు. దీనివలన రక్తప్రసరణ మెరుగుపడుతుందనీ, పలు ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి కారణం చెప్పులు లేకుండా నడవడం, నేలమీద పడుకోవడం కూడా ఓకారణమని వారు ఉదహరిస్తున్నారు.