గాలికాలుష్యంతో మానసిక సమస్యలు

16-11-2017: విపరితీమైన ఒత్తిడి, ఆందోళన, బాధ ఇలాంటి విషయాల వల్ల మానసిక సమస్యలు వస్తాయని తెలుసుకదా! అయితే తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో కలుషితమైన గాలిని పీల్చడం వల్ల కూడా మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని తేలింది. గాలికాలుష్యం వల్ల లంగ్స్‌, గుండె, చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి, కానీ దానివల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాషింగ్టన్‌ పట్టణంలో నివసించే ఆరువేల మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. అందుకని గాలికాలుష్యం బారిన పడకుండా మొహానికి మాస్క్‌ ధరించాలని, చెట్లని పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు.