వర్షాకాలం మేకప్‌!

ఆంధ్రజ్యోతి, 10-07-2018: వర్షాకాలంలో చర్మ స్వభావం వేగంగా మారుతుంటుంది. ఒకసారి జిడ్డుగా ఉంటుంది. మరోసారి పొడారి పోతుంటుంది. ఇంకోసారి చర్మంలో నీరుండదు. గాలిలోని తేమ చర్మంలోకి ఇంకదు. ఫలితంగా చర్మంలో నీటి ప్రమాణాలు తగ్గుతాయి. ఈ సీజన్‌లో చర్మం కాంతివంతంగా మెరవాలంటే ...

పొడిచర్మంతో బాధపడేవారు టోనర్స్‌కు దూరంగా ఉంటే మంచిది. లేదా మైల్డ్‌ టోనర్లను వాడాలి. జిడ్డు చర్మం, యాక్నే సమస్య బాగా ఉన్న వారికి టోనర్లు బాగా పనిచేస్తాయి.
వర్షాకాలంలో రాత్రిపూట తప్పనిసరిగా చర్మానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
మేక్‌పను తొలిగించుకోవడానికి మిల్క్‌ క్లిన్సర్‌ లేదా మేకప్‌ రిమూవర్‌ని వాడాలి.
ఫేషియల్‌ స్కిన్‌ కోసం సబ్బుల బదులు లిక్విడ్‌ క్లిన్సర్స్‌, ఫేస్‌వాష్‌, ఫోమ్స్‌ వాడాలి.
క్లిన్సింగ్‌ తర్వాత టోనింగ్‌ వాడాలి. స్కిన్‌ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా యాంటి-బాక్టీరియల్‌ టోనర్‌ వాడితే ఉత్తమం.
ఎయిర్‌కండిషన్డ్‌ వాతావరణంలో ఉండేవాళ్లు తరచూ చర్మానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. లేకపోతే చర్మం దురద పెడుతుంది.
తరచూ తడుస్తుంటే నాన్‌-వాటర్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్‌ని వాడాలి.
ఎండాకాలంలో మాత్రమే సన్‌స్ర్కీన్‌ రాసుకుంటే చాలనుకుంటారు చాలామంది. కానీ వర్షాలు పడినపుడు, మబ్బులు ముసురుకున్నప్పుడు కూడా సన్‌స్ర్కీన్‌ ప్రొటెక్షన్‌ అవసరం. వర్షాకాలంలో సైతం అతినీలలోహిత కిరణాల ప్రభావం ఉంటుంది.
వర్షంలో తడిసినపుడు తలస్నానం చేయడం మంచిది. అయితే రోజూ తలస్నానం చేయడం వెంట్రుకలకు మంచిది కాదు కాబట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు తల రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బిరుసుబారవు.
తలస్నానం చేసిన ప్రతిసారీ కండిషనింగ్‌ పెట్టుకోవాలి. లీవ్‌-ఇన్‌-కండిషనర్‌ వాడడం వల్ల డ్రై హెయిర్‌ని మేనేజ్‌ చేయడం సులభం.
వర్షాకాలంలో హెయిర్‌ స్ర్పేలు, జెల్‌లు కొట్టుకోవద్దు. అలా చేస్తే అవి మాడుకు అతుక్కుపోయి చుండ్రు సమస్య తలెత్తే అవకాశం ఉంది.
బ్లో డ్రయర్స్‌ను కూడా ఈ సీజన్‌లో వాడొద్దు.
వెంట్రుకలను స్లైలింగ్‌ చేసుకునే ముందర హ్యుమిడిటీ ప్రొటెక్టివ్‌ జెల్‌ ఉపయోగించవచ్చు.
వెంట్రుకల తీరును బట్టి హెయిర్‌కేర్‌ ఉత్పత్తులు వాడాలి.
వర్షాకాలంలో నీళ్లల్లో క్లోరిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకలను దెబ్బతీస్తుంది. అందుకే తలపై నుంచి కప్పుకునే రెయిన్‌ కోట్‌ వాడిటం మంచిది.
వాటర్‌ ప్రూఫ్‌ బ్యాగులో వాటర్‌ రెసిస్టెంట్‌ మేకప్‌ సామాగ్రి ఉంచుకోవాలి. అందులో చర్మం క్లిన్సింగ్‌ కోసం వెట్‌ వైప్స్‌, యాంటీ-ఫంగల్‌ డస్టింగ్‌ పౌడర్‌ ఉండాలి.