ఎన్నేళ్లు బతుకుతారో తెలుసా?

16-11-2017: మనిషి జీవితం ఎంతకాలమో అంటే ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు ఏ సమస్యలు చుట్టుముడతాయో కనుక్కోగలరా? కనుక్కోవచ్చనే అంటున్నారు గోల్డెన్‌సన్‌ సెంటర్‌ ఫర్‌ ఆక్చూరియల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు. చిన్నలెక్క వేస్తే ఆ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చట. ప్రస్తుత పరిస్థితి నుంచి అనారోగ్యం బారిన పడేందుకు మధ్య ఉండే కాలాన్ని ఆరోగ్యకర ఆయుఃప్రమాణంగా, మంచాన పడి చనిపోయే వరకూ ఉండే కాలాన్ని అనారోగ్య ఆయుః ప్రమాణంగా వర్గీకరించి మరీ లెక్కలు కట్టేయవచ్చని అంటున్నారు. కాకపోతే కావాల్సిందల్లా మీ జీవనశైలికి సంబంధించిన వివరాలు మాత్రమే. అయితే ఈ ఆయుష్షు అనేది ఆడవారిలోనూ, మగవారిలోనూ తేడా ఉంటుంది. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఆదాయం, విద్యార్హతలు, ఉద్యోగం లాంటి అంశాలను పరిగణంలోకి తీసుకుని ఆయుష్షుపై అంచనాలిచ్చే కాలిక్యులేటర్‌ను వారు తయారు చేశారు.