కిడ్నీ రాళ్ళను కరిగించే పుచ్చకాయ

ఆంధ్రజ్యోతి, 17-01-2018: చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కిడ్నీలో రాళ్ళు. దీనికి ఎన్ని మందులు వాడినా కరగకపోవచ్చు. ఒక్కోసారి శస్త్రచికిత్స అనంతరం కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ గింజలతో వీటిని సమర్ధవంతంగా తొలగించుకోవచ్చని వారు అంటున్నారు. పుచ్చకాయ తిన్న వెంటనే వాటి గింజలను పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకుని నీటిలో కలుపుకుని రోజుకి మూడుసార్లు చొప్పున కొన్నిరోజుల పాటు తాగితే మంచి ఫలితాన్ని పొంచవచ్చని వారు అంటున్నారు. అలాగే పుచ్చకాయ లోపల అడుగున ఉండే తెల్లని పదార్థాన్ని శరీరంలో ఫంగస్ ఉన్న ప్రాంతంలో అప్లయ్ చేస్తే క్రమేపీ దాని బారినుంచి బయటపడవచ్చని వారు సూచిస్తున్నారు.