08-12-2017: వినడానికి కొద్దిగా వింతగానే ఉన్నా నిజం అంటున్నారు అధ్యయనకారులు. మానసిక సమస్యలతోనూ, భావోద్వేగాలతోనూ బాధపడేవారు క్రమం తప్పకుండా హెల్త్ యాప్స్ వాచ్ చేస్తే పై రెండు సమస్యల నుంచి విముక్తి పొందవచ్చన్న విషయం బర్మింగ్హోమ్ యూనివర్శటీ పరిశోధకుల ఓ అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 600 మంది మీద వీరు ఆరు నెలల పాటు అధ్యయనం నిర్వహించారు. వీరి ఆహారపు అలవాట్లు, సోషల్ మీడియాలో వీరు ఎంత చురుకుగా ఉంటారు? సెల్ఫోన్లనూ, యాప్లను ఎంత చూస్తారు? అన్న విషయాలను పరిశీలించారు. వీరిలో హెల్త్ యాప్లను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేవారిలో మానసిక సమస్యలు కనుమరుగు కావడమే కాకుండా భావోద్వేగాలు అదుపులో ఉన్న విషయం గమనించారు. కాకపోతే మామూలు యాప్లు చూడడం వలన పై ఫలితాలు పొందవచ్చా? అనే విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేదు.